కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడి ఇంటి పై యువతి బంధువుల దాడి

కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడి ఇంటి పై యువతి బంధువుల దాడి
x
Highlights

కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే కొంత మంది పెద్దవాళ్లు మాత్రం వివాహం చేసుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. కుల దురహంకార హత్యలకు...

కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే కొంత మంది పెద్దవాళ్లు మాత్రం వివాహం చేసుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. కుల దురహంకార హత్యలకు పాల్పడుతున్నారు. ఇదే కోణంలో మహబూబాబాద్ కొత్తగూడ మండలంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పెద్దలకు తెలియకుండా కులాంతర వివాహం చేసుకున్నాడని యువతి వైపు బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు.

పూర్తి వివరాల్లోకెళితే రామన్న గూడెం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు, అదే గ్రామంలో ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యువతి ఇద్దరూ ప్రేమింకున్నారు. వారి ప్రేమ విషయం వారి ఇండ్లలో తెలిస్తే పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోరని వారు ఈ నెల 5వ తేదీన యువతిని తీసుకెళ్లాడు. అతని స్నేహితుల సహాయంతో పెద్దలెవరికీ తెలియకుండా ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పెద్దలకు తెలిస్తే వారి ప్రాణానికి హానికలిగిస్తా్రన్న భయంతో వారి స్నేహితుల ఇంటి వద్ద తలదాచుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వారి బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశాడు. వారు దాడి చేసిన సమయంలో యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళాలను పగళగొట్టి ఇంటిలోపలికి వెళ్లి ఇంటిని చెల్లాచెదురు చేశారు.

యువకుడి తల్లిదండ్రులు వారు ఇంటికి వచ్చేసమయానికి ఇల్లంతా ధ్వంసం అయి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తకోట ఎస్ తాహెర్‌బాబా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెళ్లి చేసుకున్న జంట తిరిగి గ్రామానికి వస్తే వారికి ప్రాణ హాని కలగకుండా రక్షణ కల్పిస్తామని ఆయన తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories