CM KCR: గుమ్మడిదల వద్ద సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం.. భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

A Warm Welcome to CM KCR at Gummadidala
x

CM KCR: గుమ్మడిదల వద్ద సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం.. భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 

Highlights

CM KCR: కేసీఆర్‌కు స్వాగతం పలికిన పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

CM KCR: గుమ్మడిదల వద్ద సీఎం కేసీఆర్‌కు పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు నుంచి కిందికి దిగి కార్యకర్తల స్వాగతాన్ని స్వీకరించారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు ఉన్నారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బోనాలు, పోతరాజులు, గంగిరెద్దులు, నెమల ఆటలు , ఊరేగింపులతో కోలాహలంగా కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మరోసారి బీఆర్ఎస్‌ను ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం నీళ్లు త్వరలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories