Drugs: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. 8 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన నాంపల్లి కోర్టు

A Turning Point In The Tollywood Drug Case
x

Drugs: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. 8 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన నాంపల్లి కోర్టు

Highlights

Drugs: FSL నివేదిక...సాక్ష్యాలను చూసి కేసులను కొట్టివేసిన కోర్టు

Drugs: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2018లో నమోదైన కేసుల్లో ఎక్సైజ్ వాఖకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్‌ నటులే టార్గెట్‌గా నమోదు చేసిన డ్రగ్స్ కేసులపై నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం సిట్‌కు అప్పగిస్తూ ఆదేశించింది. మొత్తం 8 కేసులు నమోదు చేయగా.. అందులో 6 కేసులను సరైన సాక్ష్యాలు.. ఆధారాలు లేవని కోర్ట్ కోట్టేసింది. డ్రగ్స్‌ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్‌ ఫాలో కాలేదని అప్పట్లోనే కోర్టు స్పష్టం చేసింది.

టాలీవుడ్ నటులే టార్గెగ్‌గా నెలల తరబడి విచారించిన ఎక్సైజ్ శాఖ.. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు...వెంట్రుకలు శాంపిళ్లు తీసుకుంది. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు పంపగా..వారి శరీరంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లభించలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ తేల్చింది. ఫోరెన్సిక్ నివేదిక... సాక్ష్యాల ఆధారంగా కోర్టు కేసులను కొట్టేంది.

Show Full Article
Print Article
Next Story
More Stories