World Nature Conservation Day 2020: నేడే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

World Nature Conservation Day 2020: నేడే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

World Nature Conservation Day 2020 : ప్రతి ఏడాది జూలై 28 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వాన్ని జరుపుకుంటారు. మ‌న జీవితంలో...

World Nature Conservation Day 2020 : ప్రతి ఏడాది జూలై 28 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వాన్ని జరుపుకుంటారు. మ‌న జీవితంలో ప్ర‌కృతి ప్రాముఖ్య‌త‌ను, దాన్ని ఎందుకు ప‌రిర‌క్షించాలో గుర్తుచేసే ముఖ్యమైన రోజు ఈ రోజు. ఈ ప్రపంచలో జీవించే సమస్థ ప్రాణులు ఈ ప్రకృతి ఒడిలో ఒదిగిపోతుంటాయి. అలాంటి ఈ ప్రకృతిని పరిరక్షించడానికి, దానిపై అవగాహన పెంచడానికి, ప్రకృతిని కాపాడటానికి ప్రోత్సహించడానికి ఈ రోజు మనకు అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రపంచలో ఉన్న సహజ వనరులు క్షీణించడానికి జ‌నాభా విస్పోట‌నం ఓ ప్రధాన కారణం ఉంది. భూమిపై ఉన్న ప‌రిమిత వ‌న‌రుల సమతుల్యతను కాపాడుకోవడానికి వాటిని సమర్థవంతంగా ఉపయోగించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఈ రోజు తెలియ‌జేస్తుంది. సహజ వనరులను పరిరక్షించేందుకు ఉత్తమమైన పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. సహజ అసమతుల్యత కారణంగా ఓజోన్ పొర క్షీణత, సాంకేతిక పురోగతి, విలాసవంతమైన జీవనశైలి, గ్లోబల్ వార్మింగ్, వివిధ వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన ఉష్ణోగ్రత మొదలైన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని మనకు తెలుసు. ఇటీవ‌లి కాలంలో అమెజాన్ అడ‌వుల్లో చెల‌రేగిన మంట‌లు వంటివి పర్యావరణ సమస్యలను లేవనెత్తుతున్నాయి. కానీ మన తరువాతి తరాల వారికి ప్రకృతిని అందించడానికి దాన్ని సంరక్షించడం అవసరం. దాని కోసం సహజ వనరులను ఆదా చేయడం, దాన్ని రీసైకిల్ చేయడం, సంరక్షించడం, దానిని దెబ్బతీసే పరిణామాలను అర్థం చేసుకోవడం, వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంచడం చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన వాతావరణానికి ప్రకృతి పునాది అని ఈ రోజు గుర్తించింది. ఈ రోజు వర్తమాన, భవిష్యత్ తరాల శ్రేయస్సును కోరుకుంటుంది. ప్రస్తుత, భవిష్యత్ తరాలను కాపాడటానికి ప్రకృతిని పరిరక్షించడం అవసరం. అటవీ నిర్మూలన, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం, కాలుష్యం, ప్లాస్టిక్‌లు, రసాయనాలు వాడటం వంటి పనుల వలన ఈ ప్రకృతికి హాని కలుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అంశాలు కూడా ప్రకృతి క్షీణతకు కారణమవుతాయి. మనం ఏది చేసినా అది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. నీరు, గాలి, నేల, ఖనిజాలు, చెట్లు, జంతువులు, ఆహారం మొదలైనవి జీవించడానికి భూమి ప్రాథమిక అవసరాలను అందిస్తుతంది కాబట్టి ఈ ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడాలి.

మన నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుని కొన్నిటిని ఆచ‌రించ‌డం వ‌ల్ల ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో స‌హాయం ప‌డిన‌వాళ్ల‌మౌతాం. ప్రకృతిని రక్షించడానికి, పరిరక్షించడానికి స్థిరమైన జీవనశైలిని ఆచరించడం.

- రోజువారి కార్య‌క‌లాపాల్లో కాలుష్యాన్ని పెంపొందించే వాటిని నిరుత్సాహ‌పర‌చ‌డం

- ఆహర‌, నీటి వృథాను అరికట్ట‌డం.

- న‌ళ్లాల‌ను అన‌వ‌స‌రంగా తిప్పి ఉంచ‌కుండా ఉండి నీటి వృథాను అరిక‌ట్ట‌డం.

- ప‌నిలో లేన‌ప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిష‌న‌ర్‌ల‌ను ఆపేయడం.

- చెట్లను నరికి వేయడం మానేయాలి.

- కొత్త మొక్కలను నాటాలి.

- కాలుష్యాని పెంచే వాహనాలను తగ్గించాలి.




Show Full Article
Print Article
Next Story
More Stories