MLC Kavitha: పలు సమస్యలపై భారత్ జాగృతి నిరంతరం పోరాటం చేస్తోంది

A round table meeting under the chairmanship of Kavitha President of Bharat Jagruti
x

MLC Kavitha: పలు సమస్యలపై భారత్ జాగృతి నిరంతరం పోరాటం చేస్తోంది

Highlights

MLC Kavitha: ఏప్రిల్ 11 తేదీ వరకు విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలి

MLC Kavitha: తెలంగాణలోని పలు సమస్యలపై భారత్ జాగృతి నిరంతర పోరాటం చేస్తోందని, అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశామని, మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాలని డిమాండ్ చేశామన్నారు.

అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రీ బాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్, కర్పూరి ఠాకూర్ విగ్రహాలకు నివాళులర్పించారు..

పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా..? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని, బీసీల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరఫున పోరాటం కొనసాగుతుందని చెప్పారామె.. ఇప్పటికే చాలామంది సంఘ సంస్కర్తల జయంతి, వర్థంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వాన్ని కోరామని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందన్నారామె.. అయితే అసెంబ్లీ ఆవరణలో ఏప్రిల్ 11 తేదీ వరకు జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories