Hyderabad: నగరంలో కొత్తరకం మోసం.. అమ్మాయిలతో మోష్‌ పబ్‌ డేటింగ్ స్కామ్

A New Type Of Fraud Has Come To Light in Hyderabad
x

హైదరాబాద్‌లో వెలుగుచూసిన కొత్త రకం మోసం

Highlights

Hyderabad: నగరంలో కొత్తరకం మోసం.. అమ్మాయిలతో మోష్‌ పబ్‌ డేటింగ్ స్కామ్

Dating Scam With Girls: హైదరాబాద్‌లో కొత్త రకం మోసం వెలుగుచూసింది. డేటింగ్ యాప్‌లో నయా చీటింగ్ బట్టబయలైంది. డేటింగ్ యాప్‌లో యువకులకు పరిచయమై డబ్బులు కాజేస్తున్నారు కొందరు అమ్మాయిలు. అయితే ఈ మోసం కాస్త డిఫరెంట్‌గా ఉంది. హైటెక్ సిటీలోని ఓ పబ్ కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లు అమ్మాయి చేతిలో మోసపోయినట్లు తెలిపాడు. డేటింట్ యాప్‌లో ఓ వ్యాపారవేత్తకు రితికా అనే పరిచయమైంది. దీంతో మరుసటి రోజే హైటెక్ సిటీ దగ్గర కలుద్దామంటూ మెసేజ్ చేసింది. అక్కడికి వెళ్లిన అతడిని పక్కనే ఉన్న గలేరియా మాల్‌లోని మోష్ క్లబ్‌కి తీసుకెళ్లింది.

ఇక పబ్‌లోకి ఎంటరైన తనకి ఆదిలోనే ఊహించని ఘటనలు ఎదురైనట్లు ఆ వ్యాపారవేత్త తెలిపాడు. గంట లోపే ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి సదరు యువతి తాగిందని, ఏకంగా 45 వేల రూపాయల బిల్లును తన చేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకుందని తెలిపాడు. అయితే ఈ కొత్త తరహా మోసంలో పబ్ యజమానుల పాత్ర కీలకంగా ఉందని ఆ వ్యాపారవేత్త ఆరోపించాడు. పబ్ యజమానులు మద్యం పేరుతో అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి ఉంటారని ఆ వ్యాపారవేత్త అనుమానిస్తున్నాడు. మోసపోయిన తర్వాత పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ చూస్తే పబ్‌లో జరుగుతున్న అసలు విషయం బయటపడిందని తెలిపాడు.

పబ్‌ నిర్వాహకులే అమ్మాయిలతో కలిసి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. రితికా అనే అమ్మాయి చేతిలో చాలా మంది మోసపోయినట్లు గుర్తించారు. దాదాపు 20 వేల రూపాయల నుంచి 40 వేల వరకు బిల్లులు చేసి వెళ్లిపోతున్నట్లు తెలిపాడు. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే బాధితులను బెదిరించి డబ్బులు కట్టిస్తున్నట్లు ఆరోపించాడు. కాగా రెండ్రోజుల వ్యవధిలోనే ఈ పబ్‌లో ఇలాంటి తరహా మోసాలే జరిగినట్లు తెలిపాడు. తనకు జరిగిన మోసాన్ని సోషల్‌మీడియాలో వివరంగా రాసుకొచ్చాడు ఆ వ్యాపారవేత్త. డబ్బుల ఆశతో పబ్ యజమానులు అమ్మాయిలను ఎరగా వాడుకుని మోసాలకు పాల్పుడుతున్నారని తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories