Medico Preethi Case: మెడికో ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం.. సైఫ్ సస్పెన్షన్‌ పొడిగింపు

A Key Development in the Medico Preeti Suicide Case
x

Medico Preethi Case: మెడికో ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం.. సైఫ్ సస్పెన్షన్‌ పొడిగింపు

Highlights

Medico Preethi Case: సైఫ్ సస్పెన్షన్‌‌ను మరో 97 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు

Medico Preethi Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏడాది సస్పెన్షన్‌ విధించింది. తాజాగా.. ఆ సస్పెన్షన్‌ను మరో 97 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గతడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు యత్నించగా.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది.

ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీనియర్లు, తోటి మెడికోలు, ఫ్యాకల్టీతో పాటు మొత్తంగా 70 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సైఫ్, ప్రీతి కాల్ డేటా ఆధారంగా సాక్ష్యాధారాలను సేకరించి.. ఏకంగా 970 పేజీలతో ఛార్జ్ షీట్‌ను పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు. చివరకు సైఫ్‌ను కస్టడీలోకి తీసుకుని.. అన్ని కోణాల్లో విచారణ చేయగా.. అసలు విషయాలు బయటపడటంతో అనుమానాలకు పుల్‌స్టాప్ పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories