MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

A Hearing Was Held In The Delhi High Court On Kavitha Bail Petition In The Delhi Liquor Case
x

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

Highlights

MLC Kavitha: ఇప్పటికే బెయిల్ పిటిషన్‌పై మే 10న ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

MLC Kavitha:ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సీబీఐకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్‌పై మే10న ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ మే24న విచారణ చేపట్టనుంది ఢిల్లీ హైకోర్టు. ప్రస్తుతం లిక్కర్ కేసుల్లో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు కవిత. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో.. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నేపథ్యంలో.. మే 24న ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కనుందా లేదా అనేది తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories