Nizamabad: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. యువతి ఆత్మహత్య

A Girl Suicide for Not Accepting Marriage Proposal by Boyfriend
x

Nizamabad: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. యువతి ఆత్మహత్య

Highlights

Nizamabad: ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రియురాలు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నవీపేట మండల కేంద్రంలో పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం చెంది ప్రియురాలు సూసైడ్ చేసుకుంది. గత ఏడేళ్లుగా యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల కేంద్రానికి చెందిన యువతి, అక్తర్ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

యువతి పెళ్లి విషయమై అడగగా నిరాకరించడం, ఇతర విషయాల్లో తరచుగా ఇబ్బంది పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు బెడ్ షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories