సీఎం కేసీఆర్‌కు మహారాజ కుర్చీ వేసిన బీజేపీ

A Chair Became a Hot Topic in Politics During Bandi Sanjay Mouna Deeksha
x

సీఎం కేసీఆర్‌కు మహారాజ కుర్చీ వేసిన బీజేపీ

Highlights

Bandi Sanjay: సీఎం మహారాజాల వ్యవహరిస్తున్నారు

Bandi Sanjay: బండి సంజయ్ మౌన దీక్షలో ఓ కుర్చీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ కుర్చీ వేయడంపై టీఆర్ఎస్ మండిపడింది. అంతేకాదు మాకో కుర్చీ ఉందంటూ బీజేపీపై ఫైర్ అయింది. ఇంతకీ ఆ కుర్చీ పంచాయితి ఏంటో మీరే చూడండి.

కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా మౌన దీక్ష చేపట్టారు. బీజేపీ చేసిన ఈ దీక్షలో సీఎం కేసీఆర్‌ కి ఓ మహారాజ కుర్చీ వేశారు. ఇదే ఇప్పుడు అధికార పార్టీ నాయకుల నుండి కౌంటర్ అటాక్ కి కారణమైంది. పోడు భూముల వ్యవహారంతో పాటు ధరణి వెబ్ సైట్ లోని లోపాలను సరి చేయాలంటూ బండి సంజయ్ దీక్ష చేపట్టారు. సీఎం మహారాజాల వ్యవహరిస్తున్నారని అందుకే దీక్ష శిబిరంలో కుర్చీ వేసి నిరసన తెలిపామంటున్నాయ్ బీజీపీ శ్రేణులు.

మరో వైపు ఆ కుర్చీ పై అధికార పార్టీ మండిపడింది. మోడీకి కూడా అలానే కుర్చీ వేస్తే బండి సంజయ్ తో పాటు నిరసనలో పాల్గొంటానంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్. LIC ని అమ్మనివ్వకుండా పోరాటం చేస్తూ మోడీకి ఇలానే మహారాజ కుర్చీ వేస్తామంటోంది టీఆరెస్.

ఇలా ఓ కుర్చీ వేయడం రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. అయితే కౌంటర్ గా ఇలానే మరో కుర్చీ నిరసన చేయాలని అధికార పార్టీ ఆలోచిస్తోందట. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories