అక్కపై తమ్ముడి విలువైన ప్రేమ

A Brother Precious Love for His Sister
x

అక్కపై తమ్ముడి విలువైన ప్రేమ

Highlights

Khammam: రాఖీ కట్టిన అక్కకు తులాభారం వేయించిన తమ్ముడు

Khammam: రాఖీ పౌర్ణమి సందర్భంగా తన అక్కకు ఓ తమ్ముడు జీవితాంతం గుర్తుండిపోయేలా విలువైన కానుకను అందించాడు. ఏకంగా ఆమె బరువుకు సమానంగా తులాభారం వేయించాడు. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌కు చెందిన బోలగాని బసవ నారాయణ బిడ్డ రణశ్రీకి ఆమె తమ్ముడు త్రివేది కొత్త 5 రూపాయల కాయిన్లతో తులాభారం వేయించాడు. చిన్ననాటి నుంచి తాను దాచుకున్న డబ్బును కాయిన్ల రూపంలో మార్చి ఇలా ఆమె బరువుకు సమానంగా తూకం వేయించి తన ప్రేమను చాటుకున్నాడు. మొత్తం 11 వేల 200 కాయిన్ల బరువుతో ఆమె బరువు సరిపోయింది. ఈ వేడుకను బంధువులు, సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించారు. పెళ్లైన తర్వాత తొలిసారి జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమికి రణశ్రీ రావడంతో తమ్ముడు త్రివేది ఇలా మర్చిపోలేని కానుకను అందజేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories