నేడు హైదరాబాద్‌కు రాహుల్‌.. నెక్లెస్‌ రోడ్డులో ఇందిర విగ్రహం వద్ద సభ

7th Day of Rahul Bharat Jodo Yatra in Telangana | TS News
x

నేడు హైదరాబాద్‌కు రాహుల్‌.. నెక్లెస్‌ రోడ్డులో ఇందిర విగ్రహం వద్ద సభ

Highlights

*7వ రోజు రాహుల్ భారత్‌ జోడోయాత్ర

Rahul Gandi: భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో పాదయాత్ర చేయనున్నారు. శంషాబాద్‌లో ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర.. 9 గంటలకు ఆరాంఘర్‌ చేరుకుంటుంది. తాడ్‌బండ్‌ వద్ద ఉన్న లెజెండ్‌ ప్యాలెస్‌లో రాహుల్‌ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తిరిగి 4గంటల ప్రాంతంలో పురానాపూల్‌ నుంచి బయలుదేరి హుస్సేని ఆలం, లాడ్‌ బజార్‌ మీదుగా 4.30 గంటలకు చార్మినార్‌ చేరుకుంటారు. ఆ తర్వాత గుల్జార్‌ హౌజ్‌, మదీనా, నయాపూల్‌, ఉస్మాన్‌ గంజ్‌, మొజాంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌, నాంపల్లి, పబ్లిక్‌ గార్డెన్‌, అసెంబ్లీ, ఏజీ ఆఫీస్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డు చేరుకుంటారు. అక్కడ ఇందిర విగ్రహానికి నివాళులర్పించి కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ హోదాలో తొలిసారి హైదరాబాద్‌ రానున్నారు. సచివాలయం వద్ద రాహుల్‌ పాదయాత్రలో చేరనున్న ఆయన నెక్లెస్‌ రోడ్డులో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.

రాహుల్‌ యాత్ర సందర్భంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు చార్మినార్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులను దారి మళ్లిస్తామని తెలిపారు. వాహనాలకు పబ్లిక్‌గార్డెన్‌, నిజాంకాలేజ్‌, పీపుల్స్‌ప్లాజా, సంజీవయ్యపార్క్‌, కులీ కుతుబ్‌షా స్టేడియం, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ కేటాయించినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి బోయినపల్లిలోని రాజీవ్‌గాంధీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రాహుల్‌ బస చేయనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories