Telangana: నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 69వ పాలకమండలి సమావేశం

69th Body Meeting of National Water Development Corporation in Telangana
x

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 69వ పాలకమండలి సమావేశం

Highlights

Telangana: నీటి లభ్యతను కచ్చితంగా తేల్చి, నిర్ధారించాకే గోదావరి - కావేరీ అనుసంధానం.. మరోమారు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 69వ పాలకమండలి సమావేశమైంది. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశం జరిగింది. రాష్ట్రం తరఫున హైదరాబాద్‌లోని జలసౌధ నుంచి నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సీఈ మోహన్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు. నీటి లభ్యతను కచ్చితంగా తేల్చి, నిర్ధరించాకే గోదావరి - కావేరీ నదుల అనుసంధానం విషయంలో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాలకు సంబంధించి పూర్తి స్పష్టత రావాల్సి ఉందని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు.

ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి 274 టీఎంసీల నీటిని మూడు రాష్ట్రాల్లో ఆయకట్టు, చెన్నై తాగునీటి అవసరాలు తీర్చేలా గోదావరి - కావేరి అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఛతీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్రలు వివిధ అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నీటి లభ్యతపై అధ్యయనం చేశాకే ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. తాజాగా జరిగిన సమావేశంలోనూ మరోసారి నీటి లభ్యతను తేల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories