Vikarabad: కలెక్టర్‌పై దాడి కేసులో 52 మంది అరెస్ట్.. 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ బంద్..

52 Arrested In Lagacharla For Attack On Govt Officials
x

Vikarabad: కలెక్టర్‌పై దాడి కేసులో 52 మంది అరెస్ట్.. 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ బంద్..

Highlights

Vikarabad: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా రగడ ఇంకా చల్లారలేదు.

Vikarabad: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా రగడ ఇంకా చల్లారలేదు. నిన్న దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్‌తో పాటు కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేక అధికారి సహా పలువురు అధికారులు వెళ్లారు. అయితే.. ప్రజాభిప్రేయ సేకరణను వ్యతిరేకిస్తూ.. కలెక్టర్‌, అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, అధికారుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. అది కాస్త దాడికి దారి తీసింది.

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై దాడి చేశారు రైతులు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులపై దాడి చేసినవారిలో ఇప్పటివరకు 52 మందిని గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు. పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories