Vikarabad: వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలో ఘటన

4 lakh Rupees Potato Seeds Damaged due to Negligence of Officers in Mominpet Vikarabad District
x

అధికారుల నిర్లక్ష్యంతో రూ.4 లక్షలు విలువ చేసే ఆలుగడ్డ విత్తనాలు నష్టం(ఫైల్ ఫోటో)

Highlights

* అధికారుల నిర్లక్ష్యంతో రూ.4 లక్షలు విలువ చేసే ఆలుగడ్డ విత్తనాలు నష్టం * ఆగ్రా నుంచి తెప్పించిన ఆలుగడ్డ విత్తనాలు నిలువ

Vikarabad: అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 4 లక్షల రూపాయలు విలువ చేసే ఆలుగడ్డ విత్తనాలు మట్టి పాలయ్యాయి. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలో మహిళా పొదుపు సంఘాల సభ్యులు పెట్టుబడి పెట్టి మెంబర్సుగా కొనసాగుతున్నారు. ఐతే రైతులకు మేలు రకం, అధిక దిగుబడినిచ్చే ఆలుగడ్డ విత్తనాలను అందించేందుకు డీఆర్‌డీఓ అధికారులు ఆగ్రా నుంచి తెప్పించిన సరుకును అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ గోదాం లో నిలువ ఉంచారు.

ఐతే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దాదాపు 4 లక్షలు విలువ చేసే 420 బస్తాలకు విత్తనాలు మొలకెత్తి, బూజు పట్టి మురిగిపోయాయి. తాము పెట్టుబడిగా పెట్టిన విత్తనాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని తాము భరించాలా? ప్రభుత్వం భరిస్తుందా? అని ఆందోళ చెందుతున్నారు మహిళా రైతు సంఘాల సభ్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories