నిజామాబాద్‌ జిల్లాలో అధికారుల అత్యుత్సాహం..ఓటు వేయలేదన్న కారణంతో పెన్షన్‌ కట్‌

33 Pensions in Ellareddy Municipality Have Been Cancelled
x

Representational Image

Highlights

* ఓటు వేయలేదన్న కారణంతో పెన్షన్‌ కట్‌ చేసిన కౌన్సిలర్‌ భర్త * ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 33 మంది పెన్షన్‌ రద్దు * గత మూడు నెలలుగా లబ్దిదారులకు అందని పెన్షన్‌

నిజామాబాద్‌ జిల్లాలో అధికారుల అత్యుత్సాహం బట్టబయలైంది. ఓటు వేయలేదన్న కారణంతో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 33 మంది పెన్షన్లు రద్దు చేశారు కౌన్సిలర్‌ భర్త. దీంతో గత మూడు నెలలుగా బాధితులకు పెన్షన్ అందడం లేదు. మరోమైపు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్‌ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. దీంతో విసుగుచెందిన బాధితులు రోడ్డుపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దం కాగా విషయం తెలుసుకున్న కౌన్సిలర్ భర్త మున్సిపల్‌ కార్యాలయంలోని ఆపరేటర్ల సహాయంతో లబ్దిదారులకు డబ్బులు పంపిణీ చేయించాడు. హడావిడిగా వచ్చి డబ్బులు అందించి సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఇక ఈ విషయంపై కలెక్టర్‌తో పాటు స్థానిక ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories