TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీలో 3035 ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌..

3035 Posts Will Recruit In TGSRTC By Telangana Govt
x

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీలో 3035 ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌..

Highlights

TGSRTC: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది.

TGSRTC: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్‌ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా TGSRTCలో కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 3వేల35 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌), 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌, 11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) కొలువులు ఉన్నాయి.

ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories