TS Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 2898 మంది అభ్యర్థులు

2898 Candidates Stood In The Assembly Elections Ring In Telangana
x

TS Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 2898 మంది అభ్యర్థులు

Highlights

TS Assembly Elections 2023: ఇండిపెండింట్ అభ్యర్థులకు సింబల్స్ కేటాయించనున్న ఈసీ

TS Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలక బరిలో 2 వేల 898 మంది అభ్యర్థులు మిగిలారు. 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 4 వేల 798 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో 608 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి 114 మంది బరిలో నిలిచారు. మేడ్చల్ నుంచి 67, కామారెడ్డిలో 58, ఎల్బీ నగర్‌లో 57, మునుగోడులో 50 మంది, కొడంగల్‌లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణపేట నుంచి ఏడుగురు మాత్రమే బరిలో నిలిచారు. నేటితో ఉపసంహరణకు గడువు ముగుస్తుండగా.. సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది.

అయితే.... వివిధ కారణాలతో నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఈ జాబితాలో మేడ్చల్‌లో 38, ఆర్మూర్‌లో 27, చెన్నూరు, జుక్కల్‌లో 24 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తంగా చూసుకుంటే.. 27 నియోజకవర్గాల్లో 30 పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఉపసంహరణకి నేటితో గడువు ముగియనుండటంతో.. మధ్యాహ్నం 3 గంటల తరువాత నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది. దీంతో పాటు ప్రధాన పార్టీలకు కాకుండా ఇండిపెండెంట్‌లకు సింబల్స్ కేటాయించనుంది. గుర్తులు కేటాయింపు పూర్తి అయిన అనంతరం బ్యాలెట్ నమూనా ని నియోజకవర్గాల వారిగా విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్.

Show Full Article
Print Article
Next Story
More Stories