TS DSC 2024: డీఎస్సీకి దరఖాస్తుల వెల్లువ..ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారో తెలుసా?

Telangana DSC exam candidates must follow these from today
x

TG DSC EXAMS: నేటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు షురూ..అభ్యర్థులు ఇవి తప్పకుండా పాటించాల్సిందే

Highlights

TS DSC 2024: తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షకు 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు జులై 17 నుంచి షురూ కానున్నాయి. మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుండగా..ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు.

TS DSC 2024: తెలంగాణలో వచ్చేనెల 17వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నట్లు సమాచారం. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్ ఉత్తీర్ణులైనవారు ఎస్జీటీ, ఎస్ఏ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే బీఈడీ పూర్తి చేసి టెట్ పాసైన వారు కూడా ఎస్ఏలో రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

వీటిప్రకారం డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని మొదట విద్యాశాఖ అంచనా వేసింది. అధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 27, 027, నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. నాన్ లోకల్ కోట కింద ఇతర జిల్లా వరు కూడా హైదరాబాద్ లో పెద్దెత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ దరఖాస్తు ఎక్కువ వచ్చాయి.

మేడ్చల్ జిల్లాలో అతి తక్కువగా 2,265 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీని తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశంలో 23వేల మంది ఎలాంటి ఫీజు చెల్లించకుండానే అప్లయ్ చేసుకున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories