Telangana Budget 2023: నీటిపారుదల రంగానికి రూ.26,885 కోట్లు

26885 Crores For Irrigation Sector
x

Telangana Budget 2023: నీటిపారుదల రంగానికి రూ.26,885 కోట్లు

Highlights

Telangana Budget 2023: కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం

Telangana Budget 2023: రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. వీటిలో మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయిందన్నారు మంత్రి హరీష్‌రావు. 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి జరిగిందన్నారు. 3 వేల 825కోట్లతో 12వందల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టామని, మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయని, వేసవిలో కూడా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం అన్నారు మంత్రి హరీష్‌రావు. రాష్ట్రంలో 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడింది. రానున్న కాలంలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వం కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీనికోసం నీటిపారుదల రంగానికి బడ్జెట్లో రూ.26,885 కోట్లు ప్రతిపాదిస్తున్నాం''.

Show Full Article
Print Article
Next Story
More Stories