అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మంచి మంచి సందేశాలను పోస్ట్ చేసే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఇప్పుడు మరో స్పెషల్ ట్వీట్ ను చేసారు. కొన్ని సంవల్సరాల...
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మంచి మంచి సందేశాలను పోస్ట్ చేసే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఇప్పుడు మరో స్పెషల్ ట్వీట్ ను చేసారు. కొన్ని సంవల్సరాల క్రితంనాటి ఓ అరుదైన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోను షేర్ చేసారో లేదో కొన్ని క్షణాల్లోనే అది కాస్త వైరల్ అయిపోయింది. ఆ ట్వీట్ ను చూసిన వారందరూ అద్భుతమైన కామెంట్లను ఇస్తున్నారు. అసలు ఆ ట్వీట్ ఏంటంటే 1956లో మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ టీం అత్యుత్తమ ప్రతిభను చూపిందని చెప్పారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఒలింపిక్ క్రీడల్లో ఎంతో ప్రతిభను చూపారని సీపీ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన అప్పటి ఓ ఫొటోను కూడా ఆయన జతచేసి ట్వీట్ చేసారు.
ఈ క్రీడల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును భారత్ ఓడించి సెమీస్కు చేరింది. అప్పటి భారత్ ఫుట్‌బాల్ టీంలో హైదరాబాద్ సిటీ పోలీసులు షేక్ అజీజుద్దీన్, అహ్మద్ హుస్సేన్, నూర్ మహమ్మద్, బలరాం, మహ్మద్ జుల్ఫీకరుద్దీన్ అద్భుతంగా ఆడి తమ సత్తాచాటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారత దేశ జట్టు ఒలింపిక్స్ ఫుట్‌బాల్ విభాగంలో ఇప్పటి వరకు ఈ ఘనత సాధించలేకపోయింది. ఇక పోతే ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా విధులు నిర్వర్తిస్తున్న అంజనీ కుమార్ 1990కు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన మార్చి 12, 2018లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన యునైటెడ్ నేషన్స్ పీస్ అవార్డును రెండు సార్లు దక్కించుకున్నారు.
Glorious moments : in 1956 Melbourne Olympics Indian team saw the best football performance ever by reaching the Semi Finals by defeating Australia. The team had 5 players from Hyd city police : Sk Azizuddin, Ahmad Hussain, Noor Mohd, Balram & Mohd Zulfikaruddin. Salute to them. pic.twitter.com/KoWiSv3DD0
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) September 13, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire