తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,579 కరోనా కేసులు నమోదు...

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,579 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,26,124కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,811 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,04,388కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,287కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,449 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 17,071 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 39,40,304కి చేరింది.




Show Full Article
Print Article
Next Story
More Stories