తెలంగాణలో కొత్తగా 1,432 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,432 కరోనా కేసులు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా నిన్న రాత్రి 8గంటల నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,432...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా నిన్న రాత్రి 8గంటల నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదయిన కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,17,670కు చేరింది. కాగా నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడిన బాధితుల్లో 8మంది మృతి చెందారు. కాగా ఇప్పటివరకు కరోనా మహమ్మారికి బలైన వారి సంఖ్య 1,249కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా నమోదయిన కేసుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 19,084 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందగా మరికొంత మంది ఆస్పత్రుల్లో వైద్యం అందుకుంటున్నారు. ఇక రికవరీ రేటు విషయానికొస్తే తెలంగాణాలో రికవరీ రేటు 88.76 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వం కరోనా బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో కరోనా డెత్ రేట్ 1.5శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.57 శాతానికి పడిపోయింది. అయితే గత కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తుండటంతో ప్రజలకు ఊరట లభించింది.

ఇక పోతే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో వివిధ రాష్ట్రాలనుంచి కొత్తగా 67,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీనితో కరోనా కేసుల 73,07,125కు చేరుకుంది. ఇందులో యాక్టీవ్ కేసులు 8,12,390గా ఉండగా, 63,83,441మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడచిన 24 గంటలలో దేశంలో కరోనాతో కొత్తగా మరో 680 మంది మృతి చెందారు. దీనితో మరణించిన వారి సంఖ్య 1,11,266కి చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories