హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దసరాకు పూర్తి...

125 Foot Ambedkar Statue Constructing at Hussain Sagar will Complete on Dussehra 2022 | Koppula Eshwar
x

హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దసరాకు పూర్తి...

Highlights

Hussain Sagar - Ambedkar Statue: విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Hussain Sagar - Ambedkar Statue: హైదరాబాద్‌లో భారీ అంబెడ్కర్ విగ్రహ ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ట్యాంక్ బండ్ సమీపంలో ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న స్థలంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండేళ్ల కిందటే పనులు మొదలు పెట్టాలనుకున్న కొంత అలస్యమయ్యింది. వచ్చే దసరా నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

హుసేన్ సాగర్ సమీపంలో ఎన్టీఆర్ పక్కనే 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు కాబోతోంది. రెండంతుస్తుల భవనంతో పాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. 104 కోట్లతో ఈ స్మృతి వనాన్ని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రముఖ శిల్పి సూతరాం ఆధ్వర్యంలో విగ్రహం రూపుదిద్దుకుంటుంది. బేస్‌మెట్ పనులు పూర్తయిన నేపథ్యంలో ఇక బిల్డింగ్ నిర్మాణంపై దృష్టిపెట్టారు ఆర్ అండ్ బి అధికారులు.

మరో నెలలోపు 25 అడుగుల నమూనా విగ్రహం అందుబాటులో ఉంచనుంది. వచ్చే ఏడాది దసరా నాటికి కొత్త సచివాలయంతో పాటు, 125 అంబెడ్కర్ విగ్రహం, స్మృతి వనం పనులు పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను గురువారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. పనుల పురుగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. దసరా నాటికి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories