ఆ 12ఏళ్ల బాలుడు ఏం చేసాడో తెలుసా ?

ఆ 12ఏళ్ల బాలుడు ఏం చేసాడో తెలుసా ?
x
Highlights

పుట్టిన రోజు అంటే చాలు కొంత మంది పిల్లలు ఉదయాన్ని గుడికెళ్లి ఆ దేవున్ని ప్రార్థించుకుంటారు. మరికొంత మంది పిల్లలు కొత్త దుస్తులు ధరించి తమ తరగతి గదిలో...

పుట్టిన రోజు అంటే చాలు కొంత మంది పిల్లలు ఉదయాన్ని గుడికెళ్లి ఆ దేవున్ని ప్రార్థించుకుంటారు. మరికొంత మంది పిల్లలు కొత్త దుస్తులు ధరించి తమ తరగతి గదిలో ఉన్న పిల్లలకు చాక్లెట్లు పంచిపెడతారు. కాస్త డబ్బున్న వారి పిల్లలు కొత్త డ్రెస్ కొనుక్కోవడం, కేక్ కట్ చేయడం, తన తోటి స్నహితులకు పార్టీ ఇవ్వడం ఇలా సరదాగా గడిపేయడం చేస్తారు. కాస్త బ్రాడ్ గా ఆలోచించే పిల్లలు మాత్రం పుట్టిన రోజు నాడు ఏ దిక్కూ లేని వారికి ఏదో ఒకటి చేయాలని తపన పడుతూ ఉంటారు. కానీ ఓ 12 ఏళ్ల బాలుడు తన గొప్ప మనసు చాటుకోవడానికి మరో అడుగు ముందుకేసి ఏకంగా ఓ పులిని దత్తత తీసుకున్నాడు. నగరంలోని జంతు ప్రదర్శనశాలలోని రాయల్‌బెంగాల్‌ టైగర్‌ను దత్తత తీసుకున్నాడు. దత్తత అంటే దాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఏదో దాన్ని పోషించడం కాదు ఆ పులి పోషణకయ్యే ఖర్చును అందజేశాడు.

అసలు ఆ బాలుడు ఎవరు ఏంటి పూర్తి వివరాల్లోకెళితే హైదరాబాద్‌ నగరానికి చెందిన సిద్ధార్థ్‌ షా ఏడో తరగతి చదువుతున్నాడు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ బాలుడు స్థానిక నెహ్రూ జువాలాజికల్‌ పార్కుకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులో కలిసి వెళ్లారు. 'సంకల్ప్‌' అనే రాయల్ బెంగాల్ టైగ­ర్‌ను చూసి ముచ్చటపడి దాన్ని దత్తత తీసు­కు­న్నాడు. అతని తండ్రి కాంటి­లాల్ షాతో సరదాగా గడుపుదామని వెళ్లిన సిద్ధార్థ్ క్యూరే­టర్ కార్యా­ల­యాన్ని సంద­ర్శించి, రూ .25 వేల చెక్కును జూ అధికారికి ఇచ్చారు. షాతో వచ్చిన మరో ఇద్దరు విద్యార్థులు హర్విషా జైన్, విహాన్ అతుల్ జైన్, మరో ముగ్గురు అక్కాచెల్లెల్లు ప్రేక్ష, ప్రియాల్, భక్తి నాగ్డా సిద్దార్థ్ తో పాటుగానే జంతువులు, పక్షులను దత్తత తీసుకున్నట్లు జూ అధికారులు వెల్లడించారు. అయితే వీరు ఒక్కొక్కరుగా రూ.5,000 చెక్కును అంద­జేసినట్లు చెప్పారు. అంతే కాదు ఇదే విధంగా మరికొంత మంది ముందుకొచ్చి జంతువులను దత్తత తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వన్య­ప్రా­ణుల పరి­ర­క్షణ పట్ల విద్యార్థు­లకు ఉన్న ప్రేమ, ఆప్యా­య­త­లకు నెహ్రూ జూలా­జి­కల్ పార్క్ డిప్యూటీ క్యూరే­టర్ కృత­జ్ఞ­తలు తెలి­పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories