TS: ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు.. ఇక నుంచి 6 పేపర్లే

10th Class Exams From 3rd April
x

TS: ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు.. ఆరు పేపర్లతోనే పరీక్షలు

Highlights

TS: ప్రతీ పరీక్షకు మూడు గంటల సమయం

TS: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 3 నుంచి పది పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయోలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని వెల్లడించింది. సైన్స్‌ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు ఉంటుందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories