Samsung Galaxy S23 FE: సవక చాలా సవక.. రూ.60 వేల ఫోన్ సగం ధరకే, బ్లాక్ బస్టర్ ఆఫర్ ఇది..!

Samsung Galaxy S23 FE
x

Samsung Galaxy S23 FE

Highlights

Samsung Galaxy S23 FE: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌‌లో సామ్‌సంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S23 FE: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలు ఇప్పుడు రోజువారీ జీవితంలో అవసరంగా మారాయి. ఇవి స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఒక భాగంగా అయ్యాయి. టెక్ బ్రాండ్ సామ్‌సంగ్ ఈ సంవత్సరం ఫ్లాగ్‌షిప్ లైనప్ గెలాక్సీ S24లో గెలాక్సీ AI ఫీచర్లను చేర్చింది. కొన్ని పాత ఫోన్‌లలో ఏఐ ఫీచర్లను కంపెనీ అందిచనుంది. ఇప్పుడు కంపెనీ తన చౌకైన ఫోన్ గెలాక్సీ‌లో AI ఫీచర్లను అందిస్తోంది. ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో Galaxy S23 FE భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.30 వేల కంటే తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ సేల్‌లో Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు రూ.30 వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. అలానే ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి. కస్టమర్లు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపుకు దక్కించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 FE గతేడాది భారతీయ మార్కెట్లో రూ. 59,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999, అమెజాన్‌లో రూ. 30,999. బ్యాంక్ ఆఫర్‌ల కారణంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లించే కస్టమర్‌లు రూ.1,250 వరకు అదనపు తగ్గింపును పొందుతున్నారు. ఇది కాకుండా ఫోన్‌ను నో-కాస్ట్ EMI పై కూడా కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్‌లతో ఫోన్ ధర రూ. 30 వేల కంటే తక్కువగా ఉంటుంది. ఇది గెలాక్సీ AI ఫీచర్లతో చౌకైన ఫోన్‌గా నిలిచింది. కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు గరిష్టంగా రూ. 28,300 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును పొందవచ్చు. దీని విలువ పాత మోడల్, పినితీరుపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ గ్రాఫైట్, మింట్, పర్పుల్ అనే మూడు కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S23 FE Specifications
ఫ్యాన్ ఎడిషన్ మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ టెక్నాలజీతో 6.4 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 8MP 3x ఆప్టికల్ జూమ్‌తో బ్యాక్ ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. Exynos 2200 ప్రాసెసర్‌తో వస్తున్నఫోన్ 8GB RAMతో 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. Galaxy S23 FE 10MP సెల్ఫీ కెమెరా, 4500mAh కెపాసిటీ కలిగిన పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories