Xiaomi Mi Watch: లేటెస్టు ఫీచర్లతో ఎంఐ స్మార్ట్ వాచ్

Xiaomi Mi Watch Revolve Active India Launch Date Confirmed for June 22
x
ఏంఐ స్మార్ట్ వాచ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Xiaomi Mi Watch: షియోమీ లేటెస్ట్ టెక్నాలజీతో స్మార్ట్‌ వాచ్‌ను జూన్ 22వ తేదీన విడుదల చేయనుంది

Xiaomi Mi Watch: ప్రముఖ మొబైల్‌ కంపెనీలు ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ లేటెస్ట్ టెక్నాలజీతో స్మార్ట్‌వాచ్‌ను జూన్ 22వ తేదీన విడుదల చేయనుంది. అదే రోజు భారత్‌లో ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ కూడా విడుదల కానుంది.

ఇక తాజాగా ఎంఐ వాచ్‌ రివాల్వ్‌ యాక్టివ్‌ స్మార్ట్‌ వాచ్‌ను కూడా విడదుల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉండనుండగా, వాచ్ మాత్రం అమెజాన్, ఎంఐ.కాంల్లో అందుబాటులోకి రానుంది. దీని ధర భారత్‌లో రూ.10,999గా ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే..

ఇందులో ఎస్‌పీఓ2 మానిటరింగ్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండనుంది. హార్ట్ రేట్ మానిటర్, బిల్ట్-ఇన్ జీపీఎస్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ నోటిఫికేషన్ వంటి ఎన్నో ఫీచర్లను ఎంఐ ఇందులో అందించనుంది. 1.39 అంగుళాల గుండ్రటి డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 454 × 454 పిక్సెల్స్‌గా ఉంది. స్మార్ట్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దాదాపు 110కి పైగా వాచ్ ఫేసెస్‌నను ఇందులో అందించారు. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 420 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి చార్జ్ పెడితే దాదాపు 15 రోజుల వరకు చార్జీంగ్‌ వచ్చే అవకాశం ఉంది. బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories