Xiaomi Mi Pad 5 Pro: షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్

Xiaomi Mi Pad 5 Pro tipped to use a Snapdragon 870
x

Xiaomi Mi Pad 5:(Twitter)

Highlights

Xiaomi Mi Pad: రకరకాల ఫోన్లు, ట్యాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చే షియోమి నుండి మరో ఐపాడ్ ను తీసుకొస్తోంది.

Xiaomi Mi Pad: అతి తక్కువ ధరలతో, అధునాతన ఫీచర్స్ తో రకరకాల ఫోన్లు, ట్యాబ్లెట్లను వినియోగదారులకు అందించే షియోమి నుండి మరో కొత్త రకం ఎంఐ ప్యాడ్ విడుదల చేయబోతున్నారు. 11 అంగుళాల డిస్ ప్లే తో పాటు 8 మెగా పిక్సెల్ కెమెరాని కూడా ఈ ఎంఐ ప్యాడ్ 5 లో చూడవచ్చు. స్మార్ట్ ఫోన్ కంటే మెరుగ్గా 8 జీబీ ర్యాంతో పాటు ఈ ఎంఐ ప్యాడ్ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ/512 జీబీలతో మార్కెట్ లో లభ్యమవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన పలు రకాల ట్యాబ్లెట్లలో ఉపయోగించిన స్నాప్ డ్రాగన్ 870 ని ఈ కొత్తరకం ఎంఐ 5 ప్రో లో ప్రాసెసర్ ని ఉపయోగిస్తున్నారు.

ఇప్పటికే చైనా మినిస్ట్రీ అఫ్ ఇండస్ట్రీ నుండి అనుమతి పొందిన ఈ మోడల్ ఐపాడ్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. 5జి టెక్నాలజీతో రానున్న ఈ మోడల్ ఐపాడ్ లో జీపీఎస్‌, వైఫై, బ్లూటూత్‌ లతో పాటు 120 డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ ఉంది. 8,520 ఎంఎఎచ్ వంటి అతి పెద్ద బ్యాటరీని మనం ఈ షియోమి ఎంఐ ప్యాడ్ 5ప్రో లో పొందవచ్చు. షియోమి ఎంఐ ప్యాడ్ 5 కంటే 5ప్రో లో బ్యాటరీ సామర్ధ్యం, ఇంటర్నల్ స్టోరేజ్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు కూడా ఎంఐ ప్యాడ్ 5 ప్రో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories