Internet: కొద్దిసేపు స్తంభించిన ఇంటర్నెట్‌!

World Wide Internet Outage
x

నిలిచిన ఇంటర్నెట్ సేవలు! (ఫొటో ట్విట్టర్)

Highlights

Internet: ప్రపంచవ్యాప్తంగా కొద్దిచూపు ఇంటర్నెట్ ఆగిపోయింది. పలు సోషల్ మీడియా, మీడియా, ప్రభుత్వ వెబ్‌సైట్లు నిలిచిపోయాయి.

Internet: ప్రపంచవ్యాప్తంగా కొద్దిచూపు ఇంటర్నెట్ ఆగిపోయింది. పలు సోషల్ మీడియా, మీడియా, ప్రభుత్వ వెబ్‌సైట్లు నిలిచిపోయాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న క్లౌడ్‌ సేవల కంపెనీ 'ఫాస్ట్లీ' సేవలు ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే రెడిట్‌, అమెజాన్‌, సీఎన్‌ఎన్‌, పేపాల్‌, స్పోటీఫై, అల్‌ జజీరా మీడియా నెట్‌వర్క్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి ప్రముఖ సంస్థల వెబ్ సైట్లన్నీ నిలిచిపోయాయి.

ఈ మేరకు ఫాస్ట్లీ స్పందించింది.. సమస్యను వెంటనే గుర్తించి సరిచేసినట్లు వెల్లడించింది. 2019లో ఐపీఓకి వచ్చిన ఈ సంస్థ మార్కెట్‌ విలువ 5 బిలియన్‌ డాలర్లు. అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ వంటి ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ఫాస్ట్లీ చాలా చిన్నది. అయినప్పటికీ పలు కీలక సంస్థలకు సేవలందిస్తోంది. ఇక ఇంటర్నెట్‌ స్తంభించిన సమయంలో పలు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవల్ని కొనసాగించాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ నమోదుపై సైతం దీని ప్రభావం పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories