Smartphone Problems: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా.. మీరు ఈ పనిచేయడం లేదని అర్థం..!

Whether You Update The Smartphone Or Not These Problems Occur
x

Smartphone Problems: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా.. మీరు ఈ పనిచేయడం లేదని అర్థం..!

Highlights

Smartphone Problems: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇది లేనిదే ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టలేరు.

Smartphone Problems: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇది లేనిదే ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టలేరు. దీనివల్ల అన్ని పనులు చాలా సులువుగా జరుగుతున్నాయి. దీంతో బోలెడు సమయం కూడా ఆదా అవుతుంది. అయితే తరచుగా ఫోన్‌ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురువుతుంటాయి. అప్పుడు దాని పనితీరు మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఫోన్‌ అప్‌డేట్‌ చేయడం లేదని అర్థమవుతుంది. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కడం

మీరు స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకుంటే అది త్వరగా వేడెక్కుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ అప్‌డేట్ కాకపోవడం వల్ల స్లో అవుతుంది. దీనివల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. కొన్నిసార్లు పేలిపోయే సందర్భాలు ఎదురవుతాయి.

ఫోన్‌ స్లో అవుతుంది

మీరు స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేట్‌ చేయకుంటే అది స్లో అవుతుంది. దాని పనితీరు మందగిస్తుంది. దీనివల్ల ఫోన్‌లో మల్టీ టాస్కింగ్ వర్క్‌ చేయలేరు. గేమ్స్‌ ఆడటం, వీడియోలను చూడడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయాలి.

ఫోన్‌ త్వరగా పాడవుతుంది

మీరు స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేట్‌ చేయకుంటే అది త్వరగా పాడవుతుంది. మీరు తరచుగా ఫోన్‌ అప్‌డేట్స్‌ మిస్సవుతుంటే ఫోన్‌ త్వరగా వేడెక్కుతూ స్లోగా పనిచేస్తుంది. చివరకు మొత్తం పనిచేయకుండా మారుతుంది.

మదర్‌ బోర్డు పాడవుతుంది

మీరు స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను చాలా కాలంగా అప్‌డేట్ చేయకపోతే దాని మదర్‌బోర్డ్ పనిచేయకుండా మారుతుంది. తర్వాత స్మార్ట్‌ఫోన్ పని చేయదు. దీనిని రిపేర్‌ చేయించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఫోన్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉంటే దాని పనితీరు బాగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు.

Show Full Article
Print Article
Next Story
More Stories