Whatsapp New Features: వాట్సాప్‌లో స్నాప్‌చాట్ తరహా ఫీచర్?

Whatsapp New Upcoming Features in 2021 Disappearing Messages will Delete Within 24 Hours
x
వాట్సప్ (ఫొటో ట్విట్టర్)
Highlights

Whatsapp New Features: ప్రైవసీకి సంబంధించి అన్ని యాప్‌లు యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.

Whatsapp New Features: ప్రైవసీకి సంబంధించి అన్ని యాప్‌లు తమ యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. తాజాగా వాట్సప్ ఓ ఫీచర్ ను అందించేందుకు తయారైంది. ఇక ఇప్పటికే మెసేజెస్ డిసిప్పయరింగ్ అనే ఫీచర్‌ తో ఆకట్టుకుంది. దీనిలో మన పంపిన మెసేజులు వారం రోజుల తర్వాత ఆటోమెటిక్ గా డిలీట్ అయిపోతాయి. తాజాగా 24 గంటలల్లో అవి డిలీట్ అయ్యేలా కొత్త ఫీచర్ ను తీసుకొస్తుంది.

టెక్ నిపుణుల అభిప్రాయం మేరకు.. ఈ సరికొత్త ఫీచర్ త్వరలోనే యూజర్లకు అందనుంది. ఈ 24 గంటల డిసిప్పయరింగ్ ఫీచర్ వచ్చాక కూడా 7 రోజుల ఆప్షన్‌ ఉండననున్నట్లు సమాచారం. యూజర్లే ఈ రెండు ఆప్షన్స్‌ లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు.

యూజర్ వారం రోజుల ఫీచర్ ఎంచుకుంటే, మెసేజులు వారం రోజుల తరువాత డిలీట్ అవుతాయి. అలాగే 24 గంటల ఆఫ్షన్ ఎంచుకుంటే 24 గంటల తరువాత డిలీట్ అవుతాయి. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందంట. టెస్టింగ్ పూర్తయ్యాక ఇది ఐవోఎస్, ఆండ్రాయిడ్, డెస్క్ టాప్, వెబ్‌లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ఇప్పటికే స్నాప్ చాట‌్‌లో అందుబాటులో ఉంది.

దీంతోపాటు వాట్సాప్ కొత్తగా మళ్లీ తన సేవా నియమాలకు సంబంధించిన అలెర్ట్‌ను యాప్‌లో అందించనుంది. గతంలో వీటిని యాక్సెప్ట్ చేయని ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ అలెర్ట్ వస్తోందని తెలుస్తోంది.

దీంతో పాటు చాటింగ్ డేటాను ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల మధ్య మార్చుకునేందుకు కూడా వీలయ్యేలా కొత్త ఫీచర్ పై పనిచేస్తుందంట. మల్టీ డివైస్ సపోర్ట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ తో కొత్త ఫోన్ కొన్నప్పుడు యూజర్లు చాట్ బ్యాకప్ ఈజీగా పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories