WhatsApp: జనవరి 1 నుంచి ఈ ఫోన్‌లలో పని చేయదు.. ఈ లిస్ట్‌లో మీ ఫోన్‌ ఉందా?

Whatsapp not Going to Work in These Phones From January 1st
x

Whatsapp: జనవరి 1 నుంచి ఈ ఫోన్‌లలో పని చేయదు.. ఈ లిస్ట్‌లో మీ ఫోన్‌ ఉందా?

Highlights

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్‌ మొదటి జాబితాలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

WhatsApp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్‌ మొదటి జాబితాలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్‌ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారులు భద్రతకు పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త అప్‌డేట్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది.

ఈ నేపథ్యంలో యాప్‌లో పలు రకాల మార్పులు చేర్పులు చేస్తుంటారు. దీంతో ప్రతీసారి కొత్త అప్‌డేట్స్‌తో వాట్సాప్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తూ వస్తోంది. అయితే ఇలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే క్రమంలో వాట్సాప్‌ కొన్ని పాత ఫోన్‌లకు తన సేవలను నిలిపివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని ఫోన్‌లను నిషేధిస్తూ వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పాత ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం లాంచ్ అయినా ఆండ్రాయిడ్ కిట్ కాట్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ ఇకపై పనిచేయదు. పాత ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు వాడుతుంటే కొత్త ఫోన్లకు అప్ గ్రేడ్ అవ్వాలని, ఐఫోన్ యూజర్లకు మే 5 వరకు గడువు ఇస్తున్నామని వెల్లడించింది.

ఇదిలా ఉంటే జనవర్‌ 1వ తేదీ నుంచి వాట్సాప్‌ సేవలు నిలిచిపోయే ఫోన్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, శాంసంగ్ గెలాక్సీ నోట్2, శాంసంగ్ గెలాక్సీ ఎస్4 మినీ మోటో జీ, మోటో రేజర్ HD, మోటో ఈ 2014, LG ఆప్టిమస్ జీ, LG నెక్సస్ 4, LG జీ2 మినీ, LG ఎల్ 90, సోనీ ఎక్స్ పీరియా జడ్, సోనీ ఎక్స్ పీరియా ఎస్పీ, సోనీ ఎక్స్ పీరియా టీ, సోనీ ఎక్స్ పీరియా వి, HTC 1x, HTC 1x+, HTC డిజైర్ 500, HTC డిజైర్ 601 వంటి ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు.

Show Full Article
Print Article
Next Story
More Stories