WhatsApp Proxy: సరికొత్త ఫీచర్‌తో వాట్సాప్.. ఇంటర్నెట్ లేకపోయినా చాటింగ్ చేయచ్చు!

WhatsApp Proxy
x

WhatsApp Proxy

Highlights

WhatsApp Proxy: వాట్సాప్ దాని వినియోగదారులకు అనేక ఫీచర్లను అందిస్తుంది. వాట్సాప్ ద్వారా చాటింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

WhatsApp Proxy: వాట్సాప్ దాని వినియోగదారులకు అనేక ఫీచర్లను అందిస్తుంది. వాట్సాప్ ద్వారా చాటింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, WhatsApp పని చేయడానికి ఇంటర్నెట్ అవసరం. నెట్‌వర్క్ సమస్య కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. అలాంటప్పుడు ఈ ట్రిక్ ఉపయోగించి మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా వాట్సాప్‌లో చాట్ చేయవచ్చు.

మొబైల్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ మెసేజెస్ పంపడానికి WhatsAppని ఉపయోగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ లో మెసేజ్‌లు పంపవచ్చని చాలా మందికి తెలియదు. దాని గురించి కొందరికే తెలుసు. అవును, మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా WhatsAppలో మెసెజెస్ పంపవచ్చు. కాబట్టి, ఇంటర్నెట్ లేకుండా WhatsApp ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ లేకుండా చాట్ చేయడం ఎలా?

WhatsApp అప్లికేషన్ తన వినియోగదారులకు ప్రాక్సీ ఫీచర్‌ను అందించింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గతేడాది ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్‌తో మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా వాట్సాప్‌లో చాట్ (మెసేజ్) చేయవచ్చు. మీరు దీని బెనిఫిట్స్ పొందాలంటే, మీరు మీ మొబైల్‌లో ప్రాక్సీ ఫీచర్‌ని ప్రారంభించాలి. మీ మొబైల్‌లోని WhatsApp లేటెస్ట్ వెర్షన్ ఉండాలి.

ప్రాక్సీ ఫీచర్స్ ఎలా ప్రారంభించాలి?

1. ముందుగా మీ ఫోన్‌లో WhatsApp అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి.

2. వాట్సాప్‌లో కుడివైపున మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి.

3. మీరు దానిపై క్లిక్ చేయాలి.

4. దీని తరువాత, సెట్టింగ్‌లకు వెళ్లండి.

5. ఇక్కడ మీరు స్టోరేజ్, డేటాను ఎంచుకోండి.

6. అప్పుడు మీకు ప్రాక్సీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి.

7. దీని తర్వాత, మీరు మీ ప్రాక్సీ చిరునామాను నమోదు చేయాలి. అలాగే, దానిపై క్లిక్ చేయండి.

8. ప్రాక్సీ చిరునామాను సేవ్ చేసిన తర్వాత, మీకు గ్రీన్ మార్క్ కనిపిస్తుంది. 9. అంటే ప్రాక్సీ చిరునామా యాక్టివ్ అయింది. ఇలా చేయడం వల్ల ప్రాక్సీ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.

ప్రాక్సీ ఫీచర్‌ని ప్రారంభించిన తర్వాత మీరు కాల్‌లు లేదా మెసేజ్ చేయలేకపోవచ్చు. తర్వాత మీరు లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ప్రాక్సీ అడ్రెస్ తీసివేయవచ్చు. అలాగే కొత్త ప్రాక్సీ చిరునామాను కొత్తగా యాడ్ చేయవచ్చు. ఈ సందర్భంలో మీరు ప్రాక్సీ చిరునామాను అధీకృత మూలం నుండి మాత్రమే జోడించాలి. నిజానికి ప్రాక్సీ నెట్‌వర్క్‌లో మీరు సోషల్ మీడియా లేదా సెర్చ్ ఇంజన్‌ల సహాయంతో ఇంటర్నెట్ లేకుండా మెసేజ్ లేదా కాల్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories