Water Geyser Tips: వాటర్ గీజర్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Water Geyser Tips: వాటర్ గీజర్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
x
Highlights

Water Geyser Tips: 'శీతాకాలం' వచ్చేసింది. ఈ చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేయాలంటే కొంతమంది వణికిపోతుంటారు. అందుకే వేడి నీటితో స్నానం...

Water Geyser Tips: 'శీతాకాలం' వచ్చేసింది. ఈ చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేయాలంటే కొంతమంది వణికిపోతుంటారు. అందుకే వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. అందుకోసం కొంతమంది గీజర్లను ఉపయోగిస్తుంటారు. చలికాలం వచ్చేసింది కాబట్టి వాటర్ గీజర్‌ను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.

వాటర్ గీజర్‌లో మూడు రకాలు ఉంటాయి. స్టోరేజ్ వాటర్ గీజర్‌, ఇన్‌స్టాంట్ వాటర్ గీజర్‌, సోలార్ వాటర్ గీజర్‌. స్టోరేజ్ వాటర్ గీజర్‌ పెద్ద ఫ్యామిలీలకు ఉపయోగపడతాయి. ఇవి వేడి నీటిని స్టోర్ చేస్తాయి. వీటి కెపాసిటీ 10 నుంచి 25 లీటర్ల వరకు ఉంటుంది. ఒక్కసారి వేడిచేస్తే సులువుగా ఇద్దరు లేదా ముగ్గురు స్నానం చేయొచ్చు. ఇద్దరు, ముగ్గురు సభ్యులు ఉండే కుటుంబానికి 7-10 లీటర్ల గీజర్‌ సరిపోతుంది. ఇన్‌స్టాంట్ వాటర్ గీజర్‌ వెంటనే నీటిని వేడి చేస్తాయి. 2 నిమిషాల్లో వాటర్ హీటెక్కుతుంది. అయితే వీటి కెపాసిటీ చాలా చిన్నది. 2-3 లీటర్ల ఉండే ఈ గీజర్స్.. చిన్న ఫ్యామిలీస్‌కి బాగుంటాయి. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి గీజర్‌ని ఎంచుకోవాలి.

వాటర్ గీజర్‌ హీటింగ్ కెపాసిటీ 1500 వాట్స్ నుంచి 3000 వాట్స్ వరకూ ఉండేలా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే పవర్ బిల్ ఎక్కువగా వస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది సేఫ్టీ ఫీచర్. వాటర్ హీటెక్కాక ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే గీజర్‌ని మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే హడావుడిలో మనం ఒక్కోసారి గీజర్‌ స్విచ్‌ను ఆఫ్ చేయకుండా బాత్రూమ్‌ నుంచి బయటికొచ్చేస్తాం. అలా వచ్చినా ఆటోమేటిక్‌ ఆప్షన్ ఉంటే.. వాటర్ వేడెక్కాక అదే ఆఫ్ అవుతుంది. అప్పుడు విద్యుత్ సరఫరా, సేఫ్టీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

బాత్రూమ్‌లో గీజర్‌ ఇన్‌స్టలేషన్ కోసం సరైన స్పేస్ ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఓసారి చెక్ చేసుకుంటే.. మీ బాత్రూమ్‌లో నిలువుగా లేదా అడ్డంగా ఉన్న గీజర్‌ను కొనాలా అనే క్లారిటీ వస్తుంది. అప్పుడు షాప్ లేదా ఆన్‌లైన్లో ఈజీగా సెర్చ్ చేయొచ్చు. కొనేముందు రేటింగ్ ఎంత ఉందో, రివ్యూస్ ఎలా ఉన్నాయో తప్పక చూడాలి.

గీజర్ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు:

# గీజర్‌ టైప్

# గీజర్‌ కెపాసిటీ

# ఆటోమేటిక్‌ ఆప్షన్

# ఇన్‌స్టలేషన్ కోసం బాత్రూమ్‌లో స్పేస్

# రేటింగ్, రివ్యూస్

# బ్రాండ్

Show Full Article
Print Article
Next Story
More Stories