Vivo T3 Ultra: కిక్కే కిక్కు.. వివో నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఫీచర్లు అరాచకం..!

Vivo T3 Ultra
x

Vivo T3 Ultra

Highlights

Vivo T3 Ultra: Vivo T3 అల్ట్రా సెప్టెంబర్ 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫీచర్లు, ధరలు లీక్ అయ్యాయి.

Vivo T3 Ultra: Vivo భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది Vivo T3 అల్ట్రాగా రిజిస్టర్ అయింది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ Vivo T3 సిరీస్‌లో భాగం అవుతుంది. కంపెనీ Vivo T3 అల్ట్రా వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Vivo ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ అనేక ధృవీకరణ సైట్‌లలో కూడా కనినిపించింది. దీని కారణంగా ఈ గ్యాడ్జెట్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Ultra Price Leak
ఇంటర్నెట్‌లోని అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం Vivo T3 అల్ట్రా సెప్టెంబర్ 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో మూడు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. 8GB+128GB ధర రూ.30,999, 8GB+256GB ధర రూ. 32,999, 12GB+256GB ధర రూ.34,999. ఫోన్‌ను ఫ్రాస్ట్ గ్రీన్, లూనా గ్రే కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. మరో సమాచారం ప్రకారం Vivo T3 అల్ట్రా ఆఫర్‌లతో సహా రూ. 27,999 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది మూన్ యాష్, ఫ్రాస్ట్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

Vivo T3 Ultra Specifications
Vivo T3 అల్ట్రా MediaTek డైమెన్సిటీ 9200+ SoCపై విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ Sony IMX921 సెన్సార్‌ని కలిగి ఉండవచ్చు. ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం అల్ట్రా-స్లిమ్, IP68 రేటింగ్‌తో రావచ్చు.

టిప్‌స్టర్ లీక్‌ల ప్రకారం Vivo T3 అల్ట్రా 6.77 అంగుళాల స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500nits పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటుంది. కెమెరా ముందు భాగంలో Vivo T3 అల్ట్రా వెనుకవైపు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉండవచ్చు. అయితే ముందు కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. Vivo T3 అల్ట్రా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఫోన్ IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories