5G Mobile Offers: కొత్త 5G ఫోన్.. ఆఫర్ చూస్తే గుండె ఆగిపోతుంది..!

Vivo T3 Pro 5G
x

Vivo T3 Pro 5G

Highlights

5G Mobile Offers: వివో T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ సేల్ స్టార్ట్ అయింది. రూ. 3000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 Pro 5G: చైనీస్ టెక్ బ్రాండ్ Vivo కొత్త టర్బో స్మార్ట్‌ఫోన్ Vivo T3 Pro 5G నేటి నుండి దేశీయ మార్కెట్లో సేల్‌కి వచ్చింది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్, 5,500mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఫీచర్లన్నీ ఈ ధరలో ఈ ఫోన్‌ను బలమైన ఎంపికగా మారుస్తున్నాయి. రూ. 25,000 కంటే తక్కువ ధర ఉన్న సెగ్మెంట్‌లో ఇది బెస్ట్ గ్యాడ్జెట్ అవుతుంది. అయితే ఇప్పుడు కంపెనీ లాంచ్ ఆఫర్లతో ఫోన్‌పై డిస్కౌంట్లను ఇస్తోంది. మీరు కూడా దీన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ స్పెషల్ ఆఫర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.

Vivo T3 Pro 5G Price
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేస్ బేస్ వేరియంట్ ధర రూ. 21,999. 8GB+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా హోమ్ వెబ్‌సైట్, ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమైంది.

Vivo T3 Pro 5G Offers
వివో T3 Pro 5G సాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. కంపెనీ దీనిపై ప్రత్యేకమైన లాంచ్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. HDFC, ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు ఫ్లాట్ రూ. 3,000 తక్షణ తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌పై అదనపు 5 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది.

Vivo T3 Pro 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీనికి షాట్ జనరేషన్ గ్లాస్ ప్రొటక్షన్ ఉంటుంది. అలానే ఖచ్చితమైన టచ్ రెస్పాన్స్ కోసం వెట్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. అంటే తడి చేతులతో కూడా ఉపయోగించవచ్చు. ఇది వెనుక భాగంలో లెదర్ ఫినిషింగ్, షైన్ గోల్డ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానెల్‌లో స్క్వేర్ కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. కెమెరా సిస్టమ్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందు కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది.

కంపెనీ ప్రకారం 7.49 మందంతో సెగ్మెంట్‌లో అత్యంత సన్నని కర్వ్‌డ్ ఫోన్. Vivo T3 ప్రో డిజైన్ iQOO Z9s ప్రో మాదిరిగానే ఉంటుంది. Vivo T3 ప్రో హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌ ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే Vivo స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా FunTouch OS 14పై రన్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories