Vivo S20: వివో నుంచి కొత్త స్మార్ట్‌‌ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

Vivo S20
x

Vivo S20

Highlights

Vivo S20: Vivo కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo S20 పై పని చేస్తోంది. ఫోన్ గురించి అధికారిక సమాచారం కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది కొన్ని రోజుల క్రితం TENAA సర్టిఫికేషన్‌లో లిస్ట్ అయింది.

Vivo S20: Vivo కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo S20 పై పని చేస్తోంది. ఫోన్ గురించి అధికారిక సమాచారం కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది కొన్ని రోజుల క్రితం TENAA సర్టిఫికేషన్‌లో లిస్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ చైనాలో 3C సర్టిఫికేషన్ పొందింది. ఇది దాని ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను సూచిస్తుంది. ఈ రాబోయే హ్యాండ్‌సెట్ లీకైన ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

3C సర్టిఫికేషన్ జాబితా ప్రకారం.. Vivo V2429A స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే ఛార్జర్‌తో రావచ్చు. Vivo S20 ఛార్జింగ్ విభాగంలో కొంచెం అప్‌గ్రేడ్‌ను చూడచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మేలో చైనాలో విడుదలైన తర్వాత Vivo S19 ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇవన్నీ లీకులు మాత్రమే.

లీకైన వివరాల మేరకు వివో ఎస్20 TENAA సర్టిఫికేషన్ 1.5K రిజల్యూషన్‌ను అందించే 6.67-అంగుళాల AMOELD స్క్రీన్‌తో రావచ్చని వెల్లడించింది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్, 16జీబీ ర్యామ్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. చైనాలో ఫోన్ గరిష్టంగా 1 TB స్టోరేజ్‌తో రావచ్చు.

Vivo S20 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని ప్యాక్ చేసే అవకాశం ఉంది. ఇది ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వెనుకవైపు 50-మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉండవచ్చు.

Vivo S20 OriginOS 5-ఆధారిత Android 15లో రన్ అయ్యే అవకాశం ఉంది. ఇది IR బ్లాస్టర్ , ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీని మందం 7.19 మిమీ, దాని బరువు సుమారు 186 గ్రాములు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories