Vivo V40 Offer: వివో కొత్త స్మార్ట్‌‌ఫోన్‌.. రూ.8,500 డిస్కౌంట్.. కెమెరా ఫోన్ కావాలంటే ఇదే..!

Vivo V40 Series
x

Vivo V40 

Highlights

Vivo V40 Offer: వివో V40 ఫస్ట్ సేల్ సందర్భంగా భారీ ఆఫర్ ప్రకటించింది. 8,500 రూపాయల డిస్కౌంట్‌తో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Vivo V40 Offer: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన కెమెరా ఫోకస్ట్ ఫోన్ Vivo V40ని ఇటీవలే విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. సూపర్ ఫాస్ట్ పర్ఫామెన్స్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం లాంచ్ ఆఫర్ కింద Vivo V40పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Vivo V40 Price (వివో వి40 ప్రైస్)
దేశంలో Vivo V40 స్మార్ట్‌ఫోన్ 128 GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 34,850. 256 GB స్టోరేజ్ ధర రూ. 36,850 నుండి ప్రారంభమవుతుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,899. ఫోన్ ధర రూ. 39,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే లాంచ్ ఆఫర్‌తో కంపెనీ రూ. 5000 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించడంపై అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. కస్టమర్లు అన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3500 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫోన్‌పై మొత్తం రూ.8,500 డిస్కౌంట్ లభిస్తుంది. మీరు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా ఫోన్ దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, లోటస్ పర్పుల్, టైటానియం గ్రే కలర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

Vivo V40 Specifications (వివో వి40 స్పెసిఫికేషన్స్)
వివో V40 120Hz రిఫ్రెష్ రేట్ 4,500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో పెద్ద 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ HDR10+ సపోర్ట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7 Gen3తో వస్తుంది. ఇందులో 12 GB RAM, 512 GB స్టోరేజ్‌ ఉంటుంది. ఫోన్ 80W ఫ్లాష్ ఛార్జ్‌తో కూడిన పెద్ద 5,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది Android 14-ఆధారిత FunTouchOS పై రన్ అవుతుంది.

Vivo V40 Camera Featueres (వివో వి40 కెమెరా ఫీచర్లు)
కెమెరా గురించి మాట్లాడితే ఇది 4K రికార్డింగ్ సపోర్ట్‌తో 50 MP OIS కెమెరాతో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా గురించి చెప్పాలంటే ఇది 50 MP ఫ్రంట్ ఫేసింగ్ లెన్స్‌ని కలిగి ఉంది. ఇది నైట్ మోడ్, పోర్ట్రెయిట్‌తో సహా పలు రకాల కెమెరా ఫీచర్‌లను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ v5.4, WiFi, NFC, USB-C v2.0, IR బ్లాస్టర్‌తో పాటు 4G, 5G, VoLTEని పొందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories