Vivo Y28S 5G: అదిరిపోయే వార్త.. వివో కొత్త ఫోన్‌పై కళ్లు చెదిరే డీల్, అసలు ఊహించలేదు!

Vivo has Announced a Huge Discount on the Y28S 5G Smartphone Can be Ordered at Low Cost
x

Vivo Y28S 5G: అదిరిపోయే వార్త.. వివో కొత్త ఫోన్‌పై కళ్లు చెదిరే డీల్, అసలు ఊహించలేదు!

Highlights

Vivo Y28S 5G: వివో కంపెనీ తన అభిమానులకు గొప్ప ఆఫర్ ప్రకటించింది. తన 'Y' సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు సేల్‌కి తీసుకొచ్చింది.

Vivo Y28S 5G: వివో కంపెనీ తన అభిమానులకు గొప్ప ఆఫర్ ప్రకటించింది. తన 'Y' సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు సేల్‌కి తీసుకొచ్చింది. టెక్ బ్రాండ్ Vivo జూలై నెలలో భారతదేశంలో Vivo Y28s 5Gని ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లు ధరలను తగ్గించింది. ఈ నేపథ్యంలో దీనిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు, తదితర వివరాలను తెలుసుకుందాం.

5G మొబైల్ కొనాలనుకొంటే Vivo Y28s 5G సరైన ఎంపిక. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది 6.56 అంగుళాల 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Vivo Y28s 5G Offer Price

4GB RAM + 128GB = రూ. 13,499

6GB RAM + 128GB = రూ 14,999

8GB RAM + 128GB = రూ 16,499

ఈ మొబైల్‌ను ఈ రోజు నుండి కొత్త ధరతో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్‌సైట్, ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో పాటు మీ సమీప మొబైల్ స్టోర్‌ల నుండి 500 చౌకగా కొనచ్చు. ఈ Vivo ఫోన్ వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది.

కంపెనీ వెబ్‌సైట్ నుండి ఫోన్‌ను కొనేప్పుడు, EMI Au Bank, Inducind, BOB, DBS, జె అండ్ కె బ్యాంక్, IDFC, ఫెడరల్, SBI లేదా యెస్ బ్యాంక్ కార్డ్ నుండి తగ్గింపు కూడా పొందవచ్చు. HDFC, ICICI లేదా SBI బ్యాంక్ నుండి పూర్తి చెల్లింపు చేస్తే 1,000. తగ్గింపు లభిస్తుంది. రూ. 450 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

Vivo Y28S 5G Features

ఈ ఫోన్ 6.56 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1612 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్ స్టైల్ డిస్‌ప్లేతో LCD ప్యానెల్. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 840 nits బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనంగా ఇది గ్లోబల్ DC డిమ్మింగ్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.

ఫోన్ Android 14లో రన్ అవుతుంది. ఇది Funtouch OS 14లో పని చేస్తుంది. ఈ మొబైల్ MediaTek Dimensity 6300 Octa-core ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ర్యామ్‌ను 8GB వరకు పెంచొచ్చు. అలానే 1TB మెమరీ కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఈ మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. LED ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది సోనీ IMX852 సెన్సార్. దీనితో పాటు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉంది. కంపెనీ Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ను 5,000mAh కెపాసిటీ బ్యాటరీతో విడుదల చేసింది. కంపెనీ 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీని అందిస్తోంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories