OnePlus 12 Price Drop: మీకు దగ్గల్లో విజయ్ సేల్స్ ఉందా.. వన్‌ప్లస్ ప్రీమియం ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్, లక్కీ ఆఫర్ ఇది..!

OnePlus 12
x

OnePlus 12 

Highlights

OnePlus 12 Price Drop: వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై విజయ్ సేల్స్ రూ.9000 డిస్కౌంట్ అందిస్తోంది.

OnePlus 12 Price Drop: మార్కెట్‌లోని అత్యుత్తమ ఫ్లాగ్‌‌షిప్ ఫోన్‌లలో ఒకటి వన్‌ప్లస్ 12. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కాకుండా విజయ్ సేల్స్ నుండి కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వన్‌ప్లస్ మొబైల్ బడ్జెట్ ధరలో హై ఎండ్ పర్ఫామెన్స్ అందిస్తోంది. ఈ ఫోన్ కొనాలంటే దీనిపై ఉన్న ఈఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

OnePlus 12 Offer
వన్‌ప్లస్ 12 విజయ్ సేల్స్‌లో రూ. 62,999 కొత్త ధరతో అందుబాటులో ఉంది. అయితే ఇది ఈ ఏడాది ప్రారంభంలో రూ.64,999కి లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు విజయ్ సేల్స్ ఫెస్టివల్ సేల్‌లో దీని ధర గణనీయంగా తగ్గింది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది.

ఈ డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 64,999 నుండి రూ. 62,999కి తగ్గింది. ఇది కాకుండా ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, వన్‌కార్డ్‌పై రూ. 7,000 అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 55,999కి చేరుకుంది. ఇది గొప్ప ఆఫర్ ఎందుకంటే ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చి కేవలం 8 నెలలు మాత్రమే అవుతుంది. పైగా ఇలాంటి ఆఫర్‌ను విజయ్ సేల్స్ ఎప్పుడూ అందించలేదు.

OnePlus 12 Features
ఈ వన్‌ప్లస్ 12లో Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ ఉంది. ఇది పవర్‌ఫుల్ హై-ఎండ్ మొబైల్ ప్రాసెసర్. గొప్ప స్క్రీన్, మంచి బ్యాటరీ లైఫ్‌తో స్మార్ట్‌ఫోన్‌ కోవాలనుకొనే వారికి అత్యుత్తమ సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఇది ఒకటి. ఇది HDR 10+, డాల్బీ విజన్, 4,500nits పీక్ బ్రైట్నెస్, 120Hz స్క్రీన్‌ని కలిగి ఉంది.

దీని డిజైన్ చాలా ప్రీమియం, సాఫ్ట్‌వేర్ ఇప్పటికీ చాలా బాగుంది. ఈ ఫోనం కోసం కంపెనీ 4 సంవత్సరాల Android OS అప్‌గ్రేడ్‌లు, 5 సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను అందిస్తోంది. ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories