Free Aadhaar Update: సమయం లేదు మిత్రమా.. పైసా ఖర్చు లేకుండా ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేయండి..!

Free Aadhaar Update
x

Free Aadhaar Update

Highlights

Free Aadhaar Update: సెప్టెంబర్ 14 లోపు ఆధార్ కార్డ్‌‌ను ఫ్రీగా అప్‌‌డేట్ చేసే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తుంది. ఈ సింపుల్ స్టేప్స్ ఫాలో అవండి.

Free Aadhaar Update: మనకు అవసరమైన ముఖ్యమైన పత్రాలలో ఆధార్డ్ కార్డ్ ఒకటి. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, మరే దానికన్నా అప్లై చేయాలన్న దీని అవసరం ఎంతో ఉంది. అయితే ప్రతి ఒక్కరూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. దేశ పౌరుల గుర్తింపుగా పిలువబడే ఆధార్ కార్డు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఇతర సమాచారం వంటివి అప్‌డేట్ చేయాలి. మీరు ఫ్రీగా ఆధార్‌ని అప్‌డేట్ చేసే అవకాశాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కల్పిస్తుంది. మీరు మీ ఆధార్‌లో పేరు, ఇంటిపేరు లేదా ఇంటి చిరునామా వంటి తప్పులను కూడా సరిదిద్దుకోవచ్చు. ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మీకు కొన్ని రోజుల మాత్రమే సమయం మిగిలిఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసే అ వకాశాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 14 సెప్టెంబర్ 2024 వరకు అందిస్తోంది. ఈలోపు మీరు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇంటి వద్ద కూర్చొని ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డును అప్‌డేట్ చేయవచ్చు. దీని కోసం మీరు ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ నుండి ఇంటిపేరును మార్చడానికి మీరు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అనుసరించవచ్చు. UIDAI అధికారిక వెబ్‌సైట్ కాకుండా మీరు MyAadhaar యాప్ ద్వారా ఇంటిపేరును అప్‌డేట్ చేయవచ్చు. దాని కోసం ఈ సింపుల్ స్టెప్స్ పాటించండి.

1. ముందుగా సైట్‌కి లాగిన్ అవ్వండి.

2. దీని తర్వాత పేరు అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3. పేరు మార్పు లేదా ఇంటిపేరుకు సంబంధించిన పత్రాలను సడ్మిట్ చేయండి.

4. ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేయండి.

5. మీరు 90 రోజుల్లోపు పేరు లేదా ఇంటిపేరు అప్‌డేట్ ఆధార్ కార్డ్‌ని పొందుతారు.

6. కావాలంటే ఇంటి నుంచి కూడా దగ్గర్లోని సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు తీసుకురావచ్చు.

మీరు ఆధార్ కార్డ్‌తో ఇంటి చిరునామాను అప్‌డేట్ చేయడానికి ఆన్‌లైన్, ఫార్మల్ ప్రాసెస్ కూడా అనుసరించవచ్చు. అయితే మీరు సర్వీస్ సెంటర్‌కి వెళ్లి అప్‌డేట్ చేయడాడిని ఫీజు చెల్లించాలి. అయితే UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీన్ని చేయడానికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కోసం ఇలా చేయండి.

1. UIDAI వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి.

2. ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయండి.

3. హోమ్ పేజీలో కనిపించే ఆధార్ అప్‌డేట్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.

4. మీరు అడ్రెస్ మార్చాలనుకుంటే దానిపై క్లిక్ చేయండి.

5. ఫామ్ పూర్తి చేసి సడ్మిట్ చేయండి.

6. ఈ విధంగా ఆధార్ కార్డ్‌లోని ఇంటి చిరునామా కొన్ని రోజుల తర్వాత అప్‌డేట్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories