15 వేలలోపు జీతం ఉన్నవారికి శుభవార్త.. మార్చి 31లోగా ఈ ప్రయోజనం పొందండి..

15 వేలలోపు జీతం ఉన్నవారికి శుభవార్త.. మార్చి 31లోగా ఈ ప్రయోజనం పొందండి..
x

15 వేలలోపు జీతం ఉన్నవారికి శుభవార్త.. మార్చి 31లోగా ఈ ప్రయోజనం పొందండి..

Highlights

Atma Nirbhar Bharat Rojgar Yojana: రూ.15000 వేల లోపు జీతం సంపాదించే ఉద్యోగులకు శుభవార్త.

Atma Nirbhar Bharat Rojgar Yojana: రూ.15000 వేల లోపు జీతం సంపాదించే ఉద్యోగులకు శుభవార్త. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ABRY) కింద రిజిస్ట్రేషన్ సౌకర్యం మార్చి 31, 2022 వరకు పొడిగించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. గత సంవత్సరం కోవిడ్ సమయంలో ఉపాధిని ప్రోత్సహించడానికి, కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభించారు. ఇందులో కేవలం రూ.15,000 లోపు జీతం ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.

EPF, ఇతర నిబంధనల చట్టం, 1952 ప్రకారం పని చేస్తున్న కొత్త సంస్థలు, కొత్త ఉద్యోగులు మార్చి 31, 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు. ఒక కొత్త ఉద్యోగి EPFOలో పేరు నమోదు చేసుకొని రూ. 15,000 కంటే తక్కువ జీతం పొందినట్లయితే అతను ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతాడు. 1 మార్చి 2020 నుంచి 30 సెప్టెంబర్ 2020 మధ్య ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1 తర్వాత మళ్లీ ఉద్యోగం పొందిన వారు కూడా ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. అలాంటి ఉద్యోగుల జీతం కూడా నెలకు రూ.15,000 లోపు మాత్రమే ఉండాలి.

ABRY కింద కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు ఉద్యోగులు, యజమానుల వాటా లేదా ఉద్యోగుల వాటా అందిస్తుంది. ఇది EPFO ​లో​నమోదు చేసిన మొత్తం ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

EPFOలో రిజిస్టర్ అయిన కొత్త ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 2 సంవత్సరాల పాటు ప్రోత్సాహకం లభిస్తుంది. అక్టోబర్ 1, 2020 తర్వాత EPFOతో నమోదు చేసుకున్న ఎంటిటీలు, కొత్త ఉద్యోగులందరికీ ప్రయోజనాలు అందుతాయి. 4 డిసెంబర్ 2021 వరకు 39.73 లక్షల మంది కొత్త ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు సృష్టించారు. వారి ఖాతాల్లో రూ. 2612.10 కోట్ల విలువైన ప్రయోజనాలు జమ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories