32 MP Selfie Camera Phones: 32 ఎంపీ సెల్ఫీ కెమెరా స్మార్ట్ ఫోన్లు.. కేవలం రూ.10 వేల కంటే తక్కువ ధరకే..!

These Smart Phones With 32 MP Selfie Camera Are Available For Less Than Rs.10 Thousand
x

32 MP Selfie Camera Phones: 32 ఎంపీ సెల్ఫీ కెమెరా స్మార్ట్ ఫోన్లు.. కేవలం రూ.10 వేల కంటే తక్కువ ధరకే..!  

Highlights

32 MP Selfie Camera Phones: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు మార్కెట్‌లోకి కొత్త కొత్త రకాల ఫోన్లను లాంచ్‌ చేస్తూ ఉంటారు.

32 MP Selfie Camera Phones: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు మార్కెట్‌లోకి కొత్త కొత్త రకాల ఫోన్లను లాంచ్‌ చేస్తూ ఉంటారు. ఒక్కో దానిలో ఒక్కో స్పెషాలిటి ఉంటుంది. ఈ రోజుల్లో యువత కెమెరా కెపాసిటిని చూస్తున్నారు. ఫొటోలు బాగా రావడానికి ఎక్కువ పిక్సెల్‌ కెమెరా ఉన్న ఫోన్లను తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఫోన్లకు ధర ఎక్కువగా ఉంటుంది. కానీ మార్కెట్‌లో పదివేల లోపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

భారతదేశంలో ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40ఐ స్మార్ట్‌ఫోన్ 8GB RAM/256GB వేరియంట్ రూ.9 వేల 999కి లభిస్తుంది. ఇతర ఆఫర్లను సద్వినియోగం చేసుకున్న తర్వాత ఫోన్‌ను రూ.8,999కి పొందుతారు. మైక్రో ఎస్డీ సాయంతో ఫోన్ స్టోరేజీని 2 TB వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్ ఫోన్‌లో 6.6 అంగుళాల పూర్తి HD ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ తక్కువ ధర ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఇన్‌ఫినిక్స్‌ ఫోన్‌లో Unisock T606 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో కూడిన 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ విక్రయం 21 ఫిబ్రవరి 2024 నుంచి మొదలైంది.

టెక్నోకామన్‌ 19 నియో

ఈ టెక్నో మొబైల్ ఫోన్ 6 GB/128 GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,499. ఈ ధర వద్ద మీరు అమెజాన్‌లో సులభంగా పొందుతారు. ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ సూపర్ నైట్ బ్యాక్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఫోన్‌లో 6 జీబీ ర్యామ్ ఉన్నప్పటికీ 5 జీబీ వర్చువల్ ర్యామ్ సాయంతో ఫోన్ ర్యామ్‌ను 11 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ పూర్తి HD ప్లస్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వేగం, మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫోన్‌లో MediaTek Helio G85 గేమింగ్ ప్రాసెసర్ అందించారు. ఈ పరికరం 5000 mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అమెజాన్‌లోని లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ 47 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories