Smartphone Under 7K: ఇది నేను చూడలే.. రూ.7 వేల కంటే తక్కువ ధరకే ఈ ఐదు ఫోన్లు.. ఫీచర్లు అదరిపోయాయ్..!

Smartphone Under 7K
x

Smartphone Under 7K

Highlights

Smartphone Under 7K: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ వినియోగదారుల కోసం కొత్త గ్యాడ్జెట్లను తీసుకువస్తూనే ఉన్నాయి.

Smartphone Under 7K: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ వినియోగదారుల కోసం కొత్త గ్యాడ్జెట్లను తీసుకువస్తూనే ఉన్నాయి. మీరు 7000 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన ఫోన్లు ఉన్నాయి. వీటి ధర తక్కువగా ఉన్నప్పటికీ అవి మీకు ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Samsung Galaxy M05

ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ. 6499. దీనిలో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. కెమెరా ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో 50 MP హై-రిజల్యూషన్ డ్యూయల్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది 25 W ఫాస్ట్ ఛార్జింగ్, పెద్ద 5000mAh బ్యాటరీతో C-టైప్‌ని కలిగి ఉంది. ఆక్టా కోర్ MediaTek Helio G85 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది.

Lava O3

లావా అనేది భారతీయ బ్రాండ్. ఇది తన వినియోగదారులకు గొప్ప పరికరాలను అందిస్తుంది. ఫోన్ 6.75 అంగుళాల డిస్‌ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్ UNISOC 9863Aను కలిగి ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో 13MP AI కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 10W ఛార్జింగ్ , టైప్-C USB కేబుల్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ. 6,199. మీరు దీన్ని అమెజాన్‌ నుంచి ఆర్డర్ చేయచ్చు.

POCO C65

ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ. 6,999. దీనిలో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది.ఇది కాకుండా 4 GB RAM + 128 GB ROM కలిగి ఉన్న Helio G85 ప్రాసెసర్‌తో లింకై ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడితే డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 8MP ఫ్రంట్ కెమెరాతో పాటు 50 MP AI లెన్స్, 2MP కెమెరా ఉన్నాయి. పవర్ చేయడానికి 5000mAh బ్యాటరీ ఉంది.

Redmi a3x

ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ. 6999. ఇందులో 6.71 అంగుళాల HD + 90Hz డిస్‌ప్లే ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో వస్తుంది. ఫోన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3GB వర్చువల్ ర్యామ్‌తో 6GB వరకు RAMని కలిగి ఉంది. కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ ఉంది. 8MP AI ప్రైమరీ సెన్సార్‌ కెమెరా ఉంది.ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, USB టైప్-Cతో పాటు 10W ఛార్జర్ ఇన్-బాక్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories