Refrigerator Blast Reason: మీరు చేసే ఈ తప్పులే ఫ్రిడ్జ్‌ పేలుడుకు కారణమవుతాయి.. జాగ్రత్త..!

These are the mistakes you make that can cause a fridge explosion know about them
x

Refrigerator Blast Reason: మీరు చేసే ఈ తప్పులే ఫ్రిడ్జ్‌ పేలుడుకు కారణమవుతాయి.. జాగ్రత్త..!

Highlights

Refrigerator Blast Reason: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉంటుంది. చాలా రకాల వస్తువులు పాడవకుండా దీనిలో స్టోర్‌ చేస్తారు.

Refrigerator Blast Reason: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉంటుంది. చాలా రకాల వస్తువులు పాడవకుండా దీనిలో స్టోర్‌ చేస్తారు. చల్లదనం వల్ల ఇవి చాలా కాలంపాటు నిల్వ ఉంటాయి. అయితే ఫ్రిడ్జ్‌ సరిగ్గా మెయింటెన్‌ చేయాలి. లేదంటే పేలిపోయే ప్రమాదం ఉంటుం ది. ఫ్రిడ్జ్‌ పేలిపోయి చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. కాబట్టి ఫ్రిడ్జ్‌ని మంచి కండీషన్‌ లో ఉంచాలి. అయితే చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. ఇవి ఫ్రిడ్జ్‌ పేలుడుకు కారణమవుతాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు దాని టెంపరేచర్‌ను ఎప్పుడూ జీరోకి తగ్గించకూడదు. ఎందుకంటే దీని కారణంగా రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ అవసరమైన దానికంటే ఎక్కువగా పని చేస్తుంది. దీనివల్ల అది బాగా హీట్‌ అయి పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్‌ను ఆన్ చేసి చాలా రోజుల నుంచి దాని డోర్‌ ఓపెన్‌ చేయకుంటే దానిని తెరిచే ముందు పవర్‌ను ఆపివేసి ఆపై ఓపెన్‌ చేయాలి. దీనివల్ల ఫ్రిడ్జ్‌ పేలిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

రిఫ్రిజిరేటర్‌లో ముఖ్యంగా కంప్రెసర్ భాగంలో ఏదైనా లోపం ఉంటే దానిని కంపెనీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఎందుకంటే అసలు భాగాలు కంపెనీలోనే లభిస్తాయి. స్థానికంగా దొరికే భాగాలను ఉపయోగిస్తే అది కంప్రెసర్‌లో పేలుడుకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు రిఫ్రిజిరేటర్‌లో ఐస్‌ గడ్డకట్టాలని టెంపరేచర్‌ తగ్గించి చాలాసేపు డోర్‌ తెరవకుండా ఉండకూడదు. గంటకు ఒకసారైనా డోర్‌ తెరవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల టెంపరేచర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. విద్యుత్‌ హెచ్చుతగ్గులు ఉన్న ప్రదేశంలో రిఫ్రిజిరేటర్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇలా జరిగితే రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పై ఒత్తిడి పెరిగి పేలుడు సంభవిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories