Smart Phone: మీ ఫోన్‌లో ఈ మార్పులా.? అయితే హ్యాకింగ్ గురైనట్లే..!

These are the Changes Occur in Your Smart Phone When Phone was Hacked
x

Smart Phone: మీ ఫోన్‌లో ఈ మార్పులా.? అయితే హ్యాకింగ్ గురైనట్లే..!

Highlights

Smart Phone: స్మార్ట్ ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిందో దానిని ఉపయోగించుకొని నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

Smart Phone: స్మార్ట్ ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిందో దానిని ఉపయోగించుకొని నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా ఆర్థిక నేరాలకు ఎక్కువుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు ఖాతాల్లో ఉన్న డబ్బులు కొట్టేసిన ఉదంతానికి సంబంధించి ఎన్నో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కసారి ఫోన్‌ హ్యాక్‌కి గురైతే మీ వ్యక్తిగత సమాచారమంతా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మరి మన ఫోన్‌ హ్యాకింగ్‌కి గురైందో లేదో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్‌లో జరిగే కొన్ని మార్పులు ఫోన్‌ హ్యాక్‌కి గురైనట్లు చెబుతాయి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీ ఫోన్‌ ఉపయోగించకపోతున్నా బ్యాటరీ త్వరగా డిశ్చార్చ్‌ అవుతున్నట్లయితే హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫోన్‌ హ్యాక్‌కి గురైతే.. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్‌ వంటివి రన్‌ అవుతుంటాయి. దీనివల్ల మీ ప్రమోయం లేకుండానే బ్యాటరీ డిశ్చార్చ్‌ అవుతుంది.

* ఇక మీ ప్రమోయం లేకుండా ఫోన్‌లో ఏదైనా కొత్త యాప్స్ డౌన్‌లోడ్‌ అయితే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఇలా మీ అనుమతి లేకుండా యాప్స్‌ డౌన్‌లోడ్‌ అయితే కచ్చితంగా మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని అర్థం చేసుకోవాలి.

* స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించకపోతున్నా ఫోన్‌ వేడెక్కుతుంటే మీ హ్యాక్‌ గురైనట్లు అర్థం చేసుకోవాలి. దీనికి కూడా బ్యాగ్రౌండ్‌లో యాప్స్ రన్‌ కావడమే కారణంగా చెప్పొచ్చు.

* కొన్ని సందర్భాల్లో ఫోన్‌ హ్యాక్‌కి గురైతే.. స్క్రీన్‌ ఫ్లాషింగ్‌, దానంతటదే ఫోన్‌ సెట్టింగ్స్‌లో మార్పులు జరగడం వంటి వాటి ఆధారంగా కూడా మీ ఫోన్‌ హ్యాక్‌కి గురైన విషయం తెలుసుకోవచ్చు.

* అలాగే మీరు కాల్స్ మాట్లాడుతోన్న సమయంలో బ్యాగ్రౌండ్‌లో ఏదైనా శబ్ధం వినిపిస్తున్నట్లు అనిపిస్తే మీ ఫోన్‌ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఫోన్‌ ట్యాపింగ్‌ సమయంలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* ఇక ఫోన్‌ను హ్యాక్‌ చేసిన నేరగాళ్లు మీ ఫోన్‌లో కొన్ని రకాల యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తుంటారు. అందుకే మీ ఫోన్‌లో గూగుల్ హిస్టరీలో కానీ, ప్లే స్టోర్‌లో కానీ మీకు సంబంధం లేకుండా ఏవైనా యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తున్నట్లు అనిపిస్తే హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి.

ఇలా చేయండి..

మీ ఫోన్‌ హ్యాక్‌కి గురైనట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మీ పాస్‌వర్డ్‌లను ఫోన్‌లో కాకుండా మరో గ్యాడ్జెట్‌లో మార్చుకోవాలి. అలాగే వ్యక్తిగత ఫొటోలు ఏవైనా ఉంటే ఇతర ఫోన్‌లోకి పంపించుకొని డిలీట్ చేయాలి. అలాగే యూపీఐ పేమెంట్స్‌కి సంబంధించి పిన్‌లను మార్చుకోవాలి. అలాగే ఫోన్‌ను ఫ్లైట్‌ మోడ్‌కి మార్చుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories