WhatsApp: ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్లు.. వాటి ఉపయోగాలు ఇవే..!

These are the Best Features Whatsapp Introduced in 2024
x

WhatsApp: ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్లు.. వాటి ఉపయోగాలు ఇవే..!

Highlights

WhatsApp: స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

WhatsApp: స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే 2024లో వాట్సాప్‌ పలు ఆకర్షణీయమైన ఫీచర్లను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన కొన్ని బెస్ట్‌ ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* వాట్సాప్‌ ఈ ఏడాది తీసుకొచ్చిన మరో బెస్ట్‌ ఫీచర్స్‌లో స్టేటస్‌ ట్యాగ్‌ ఆప్షన్‌. మీరు వాట్సాప్‌లో స్టేటస్‌ అప్‌లోడ్‌ చేసే సమయంలో @ ఐకాన్‌ ద్వారా మీ కాంటాక్ట్‌ నెంబర్‌లోని వ్యక్తులను ట్యాగ్‌ చేయొచ్చు. దీంతో సదరు వ్యక్తికి వెంటనే నోటిఫికేషన్‌ వెళ్తుంది. అయితే మీరకు ట్యాగ్‌ చేసిన విషయం ఇతర యూజర్లకు తెలియదు.

* వీడియోకాల్‌లో కూడా వాట్సాప్‌ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ కాల్‌ మాట్లాడుతున్న సయంలో బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం సరికొత్త ఫిల్టర్లను తీసుకొచ్చింది. 10 రకాల బ్యాక్‌గ్రౌండ్‌ ఆప్షన్స్‌, 10 రకాల ఫిల్టర్లు ఇచ్చారు.

* ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌ ఈ ఏడాది కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌ డీపీని స్క్రీన్‌ షాట్‌ తీసుకునే అవకాశం లేకుండా చేసింది. దీంతో మీ డీపీ ఫొటో భద్రతా పదిలంగా ఉంటుందన్నమాట.

* లాక్‌ చాట్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ను మరింత సులభతరం చేసేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా సెట్టింగ్స్‌లోకి వెళ్లే అవసరం లేకుండా నేరుగా మీరు లాక్‌ చేయాలనుకుంటున్న చాట్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి 'లాక్‌ చాట్‌' ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది.

* ఈ ఏడాది వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్‌లో 'వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్ట్స్' ఒకటి. సాధారణంగా వాట్సాప్‌లో వచ్చే వాయిస్‌ మెసేజ్‌లను నలుగురిలో ఉన్నప్పుడు వినడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌కు వచ్చిన వాయిస్‌ మెసేజ్‌ను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడానికి చాట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'వాయిస్‌ మెసేజ్‌ ట్రిన్స్‌క్రిప్ట్స్‌' అనే ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories