Smartphone: కంటి చూపు లేని వారు ఫోన్‌ ఎలా వాడాలి.? ఈ యాప్స్‌ వారికి వరం..!

These are the Best Apps for Blind Smart Phone Users
x

Smartphone: కంటి చూపు లేని వారు ఫోన్‌ ఎలా వాడాలి.? ఈ యాప్స్‌ వారికి వరం..!

Highlights

కంటి చూపులేని వారు స్మార్ట్ ఫోన్స్‌ను ఉపయోగించడం కాస్త కష్టమైన విషయమని తెలిసిందే. అయితే దివ్యాంగుల కోసం కూడా కొన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా.?

Smartphone: ఒకప్పుడు ఫోన్‌ అంటే కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగించే ఒక వస్తువు. కానీ ఎప్పుడైతే స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చిందో పరిస్థితులు మారిపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్ మొదలు ఆర్థిక లావాదేవీలకు వరకు అన్నింటికీ స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కంటి చూపులేని వారు స్మార్ట్ ఫోన్స్‌ను ఉపయోగించడం కాస్త కష్టమైన విషయమని తెలిసిందే. అయితే దివ్యాంగుల కోసం కూడా కొన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా యాప్స్‌ అవి ఎలా ఉపయోగపడతాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

* కంటి చూపు లేని వారికి స్క్రీన్‌ రీడర్‌ యాప్స్‌ బాగా ఉపయోగడపతాయి. ఇవి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్‌ను సౌండ్‌ రూపంలోకి మార్చి మనకు వినిపిస్తాయి. దీంతో అంధులు సులభంగా తమకు వచ్చిన మెసేజ్‌లను అలాగే స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతున్న టెక్ట్స్‌ను అర్థం చేసుకోవచ్చు. చివరికి వెబ్‌ పేజీల్లో ఓపెన్‌ చేసే కంటెంట్‌ను సైతం వినిపిస్తుంది.

* గూగుల్ మ్యాప్స్‌ వంటి సేవలను అందించేందుకు. 'సీయింగ్ ఏఐ', 'బి మై ఐస్' వంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. సీయింగ్‌ ఏఐ ఆడియో గైడ్ లాగా పనిచేస్తుంది. ఇది చుట్టు పక్కల ఉన్న విషయాలను గుర్తించి వాయిస్‌ ద్వారా స్మార్ట్ ఫోన్‌ యూజర్లను అలర్ట్ చేస్తుంది. దీంతో కంటిచూపు లేని వారు కూడా ఎంచక్కా నావిగేషన్‌ వాడుకోవచ్చు.

* వీటితో పాటు వాయిస్‌ అసిసెంట్స్‌ కూడా అంధులకు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా గూగుల్‌ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్‌ అసిస్టెంట్స్‌ సేవలు దివ్యాంగులకు వరం లాంటివని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్‌ స్క్రీన్‌ లాక్‌లో ఉన్నా సరే కేవలం వాయిస్‌ కమాండ్‌ ఆధారంగా మీ ఫోన్‌ను ఆపరేట్‌ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మ్యూజిక్‌ ప్లే చేసుకోవచ్చు, నచ్చిన యాప్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. అలారమ్‌ సెట్ చేసుకోవచ్చు. ఇలా వాయిస్‌ కమాండ్స్‌తో చేయలేని పని అంటూ ఉండదు. ఈ యాప్స్‌ అన్నీ కంటి చూపు లేని వారికి ఎంతగానో ఉపయోగపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories