Motorola G45 5G: మోటో ప్రియులకు శుభవార్త.. 5జీ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ..!

Company has Reduced the Price of Motorola G45 5G Phone It can be Purchased at a Discount of 23 Percent
x

Motorola G45 5G: మోటో ప్రియులకు శుభవార్త.. 5జీ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్..!

Highlights

Motorola G45 5G: మోటో ప్రియులకు శుభవార్త. Motorola G45 5G ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ లభిస్తుంది.

Motorola G45 5G: మోటో ప్రియులకు శుభవార్త. Motorola G45 5G ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ లభిస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం తగ్గింపుతో బుక్ చేయచ్చు. మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు 5 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

కంపెనీ Motorola G45 5Gని కేవలం రూ.9,999కే విక్రయిస్తోంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీనితో పాటు ఇది 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. మీరు బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Motorola G45 5G బెస్ట్ ఛాయిస్.

కంపెనీ Motorola G45 5Gని రెండు స్టోరేజ్ వేరియంట్లలో విక్రయిస్తోంది. ఈ ఫోన్ 4GB +128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 10,999. 8GB + 128GB స్టోరేజీని రూ. 12,999తో పరిచయం చేశారు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో కొనడానికి అందుబాటులో ఉంది. వివా మెజెంటా, బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి.

Moto G45 5G Features

మోటరోలా G45 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ Android 14 OSలో పని చేస్తుంది. ఇందులో 4GB, 8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్, మైక్రో SDతో 1TB వరకు పెంచుకొనే మెమరీ ఉన్నాయి.

మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో ఆటో ఇమేజ్ మెరుగుదల, మాక్రో విజన్ కెమెరా, ఆటో నైట్ విజన్, ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఫోన్ 162.7 x 74.64 x 8.03mm మందం మరియు 18 గ్రాముల బరువు ఉంటుంది. మొబైల్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ ఉంటుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, బోల్డ్ జెస్చర్ ఫీచర్‌లు, 13 5G బ్యాండ్‌లు, డ్యూయల్ సిమ్ 5G, బ్లూటూత్ 5.2, Wi-Fi మొదలైనవి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories